‘సాగర’ మథనం చేస్తున్న కేసీఆర్..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మరణంతో నాగార్జున్ సాగర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో నాగార్జున్ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. Also Read: శివరాజ్‌సింగ్‌తో కేసీఆర్‌‌ పర్సనల్‌ భేటీ : ఆంతర్యం ఏంటి..? నాగార్జున్ సాగర్ నియోజకవర్గంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ నజర్ వేశారు. ఆ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులన్నింటిని ఎన్నికల నాటికి పూర్తి చేసేలా అధికార యంత్రాంగాన్ని ఉరుకులు […]

Written By: Neelambaram, Updated On : January 1, 2021 5:34 pm
Follow us on

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మరణంతో నాగార్జున్ సాగర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో నాగార్జున్ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Also Read: శివరాజ్‌సింగ్‌తో కేసీఆర్‌‌ పర్సనల్‌ భేటీ : ఆంతర్యం ఏంటి..?

నాగార్జున్ సాగర్ నియోజకవర్గంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ నజర్ వేశారు. ఆ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులన్నింటిని ఎన్నికల నాటికి పూర్తి చేసేలా అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.

దీంతోపాటు నాగార్జున్ సాగర్లో టీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థి కోసం సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో సానుభూతి పవనాలు కలిసిరాకపోవడంతో నాగార్జున్ సాగర్లో నోముల నర్సింహాయ్య కుటుంబానికి సీటు ఇవ్వకపోవచ్చనే టాక్ విన్పిస్తోంది.

అయితే పరిస్థితిబట్టి నోముల కుటుంబానికి సీటు ఇవ్వాలా? లేదా అన్నది డిసెడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కన్పిస్తుంది.

Also Read: ఆ రూల్స్‌ ఇక్కడా అమలు చేయండి..: కోవిడ్‌పై ఏపీ సీఎస్‌ ఆదేశాలు

కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు జానారెడ్డి లేదా అతడి కుమారుడు రఘువీర్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. దీంతో టీఆర్ఎస్ నుంచి నలుగురు అభ్యర్థుల పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి.

శాససన మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి పేరు తెరపైకి రాగా ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నారని సమాచారం.

అదేవిధంగా మరో సీనియర్ నేత ఎంసీ కోటిరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. సానుభూతి కోణంలో చూస్తే నోముల కుటుంబానికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నలుగురిలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్