https://oktelugu.com/

2021 డైరీ: ఈ సినిమాల‌పైనే బోలెడు ఆశలు !

సినిమా ఇండస్ట్రీకి 2020 అనేది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిన ఒక పీడకల. సినీ పరిశ్రమల చరిత్రలోనే 2020 అంత అత్యంత చేదు సంవత్సరం మరొకటి లేదు. సినిమా పుట్టిన దగ్గర నుండి ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదురుకున్న దాఖలాలు కూడా ఎక్కడా లేవు. అంతలా, కరోనా.. సినిమాల పై ప్రభావాన్ని చూపించింది. మరి, ప్రస్తుతం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయట పడటానికి ఈ కరోనా కష్ట కాలాన్ని నెట్టుకురావడానికి.. మొత్తానికి మేకర్స్ తమ సినిమాలను […]

Written By:
  • admin
  • , Updated On : January 1, 2021 / 05:01 PM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీకి 2020 అనేది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిన ఒక పీడకల. సినీ పరిశ్రమల చరిత్రలోనే 2020 అంత అత్యంత చేదు సంవత్సరం మరొకటి లేదు. సినిమా పుట్టిన దగ్గర నుండి ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదురుకున్న దాఖలాలు కూడా ఎక్కడా లేవు. అంతలా, కరోనా.. సినిమాల పై ప్రభావాన్ని చూపించింది. మరి, ప్రస్తుతం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయట పడటానికి ఈ కరోనా కష్ట కాలాన్ని నెట్టుకురావడానికి.. మొత్తానికి మేకర్స్ తమ సినిమాలను విడుదలకు ముస్తాబు చేస్తున్నారు. ఎలాగూ 2020 వెళ్లిపోయింది. బాక్సాఫీసు క‌ళాహీనంగా త‌యారైంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

    కానీ, వచ్చే ఏడాది సినిమాల ప‌రిస్థితి మారబోతోందని ఇప్పటికే ఓ అంచనాకి వచ్చేశారు మేకర్స్. మరోపక్క రోజురోజుకూ క‌రోనా భ‌యాలు కూడా తగ్గుతున్నాయి కాబట్టి.. ఇక థియేట‌ర్లు కూడా మునిపటిలానే తెర‌చుకున్నాయి. అలాగే కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మ‌రి రిలీజ్ అవుతోన్న సినిమాల్లో చూడ‌ద‌గ్గ సినిమాలేంటి? ఏ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఆశగా ఎదురుచూస్తున్నారో చూద్దాం.

    ముందుగా ‘ఆర్ఆర్ఆర్’. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. యావ‌త్ భార‌తీయ చ‌ల‌న చిత్ర‌సీమ ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తోంది. బాహుబ‌లి త‌ర‌వాత‌… రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న సినిమా కావడం, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లాంటి నిజమైన స్టార్ల మ‌ల్టీస్టార‌ర్ కావడం, ఈ సినిమాకి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

    అలాగే మరో సినిమా ‘ఆచార్య’‌. చిరంజీవి – కొర‌టాల కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌రాజ‌యం అంటూ లేని కొర‌టాల‌ శివ.. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు కావడం ఈ సినిమా పెద్ద బలం. పైగా రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు ఈ సినిమాలో.

    Also Read: ఎన్టీఆర్ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్.. !

    ఇక ‘రాధే శ్యామ్’ ప్ర‌భాస్ సినిమా అనే ట్యాగ్ లైన్ చాలు.. ఈ సినిమా రేంజ్ చెప్పడానికి. అలాగే ఎఫ్ 3ను అత్యంత వేగంగా పూర్తి చేయాల‌న్న‌ది దిల్ రాజు ఆలోచ‌న‌. ఇక ఈ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అలాగే సుదీర్ఘ విరామం త‌ర‌వాత‌.. ప‌వ‌న్ మ‌ళ్లీ చేస్తోన్న సినిమా వ‌కీల్ సాబ్‌. పవన్ ఫ్యాన్స్ కి ఈ సినిమానే పెద్ద పండుగ.

    ఇక కేజీఎఫ్ చాప్ట‌ర్ 2. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైపోయింది. దక్షిణాదిన దుమ్ము రేపిన ఈ చిత్రం కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాలతో పాటు ఈ కొత్త సంవత్సరంలో రానున్న నారప్ప‌. క్రాక్‌, రెడ్‌, ల‌వ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌, ట‌చ్ జ‌గ‌దీష్‌, ఫైట‌ర్, విరాట‌ప‌ర్వం లాంటి క్రేజీ సినిమాల పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్