ఏపీలో ఆలయాలపై వరుస దాడులు ఖంగారెత్తిస్తున్నాయి. నిన్నటికి నిన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆలయాలను ధ్వంసం చేసే వారిని ఉపేక్షించకూడదని.. వారిని కఠినంగా శిక్షించాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినా.. ఆగంతకులు మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదు. తాజాగా మరో ఆలయంపై దాడికి పాల్పడడం సంచలనానికి కారణమైంది.
Also Read: ఆ రూల్స్ ఇక్కడా అమలు చేయండి..: కోవిడ్‌పై ఏపీ సీఎస్ ఆదేశాలు
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది రథం దగ్ధం ఘటన మరువకముందే రాజమహేంద్రవరం శ్రీరాంనగర్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారు జామున మరోఘటన జరిగింది. విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రహ్మణేశ్వర స్వామి విగ్రహానికి ఉన్న రెండు చేతులను గుర్తు తెలియని వ్యక్తులు విరిచేశారు. ఈ ఉదయం తలుపులు తెరిచిన అర్చకులు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న సెంట్రల్ జోన్ డీఎస్పీ సంతోష్, సీఐ దుర్గా ప్రసాద్ పరిస్థితిని పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షపడేలా చూస్తామని తెలిపారు. టీడీపీ రాష్ట్ర నాయకుడు గన్ని కృష్ణ ఇంటికి సమీపంలోనే ఈ ఆలయం ఉంది.
Also Read: శివరాజ్‌సింగ్‌తో కేసీఆర్ పర్సనల్ భేటీ : ఆంతర్యం ఏంటి..?
అయితే.. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత, ఆలయ ధర్మకర్త గన్ని కృష్ణ అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు జరపడం నిత్యకృత్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ఇటీవల అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనలో ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తల విరగొట్టినా ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్