తెలంగాణలో పాఠశాలలపై కేసీఆర్ నిర్ణయమిదీ

తెలంగాణలో సదువులు సక్కదిద్దాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు. ఇప్పటికే రెండేళ్లుగా పరీక్షలు లేకుండా ఉత్తిపుణ్యానికి విద్యార్థులను పాస్ చేయించిన కేసీఆర్ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా తరగతులు నిర్వహించి పరీక్షలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. కరోనా లాక్ డౌన్ తో పిల్లలకు వైరస్ సోకుండా గత సంవత్సరం మొదటి వేవ్ లో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేశారు. ఈ సంవత్సరం మొత్తం కరోనాతోనే పోయింది. సెకండ్ వేవ్ తో ఈ సంవత్సరం కూడా విద్యార్థులను […]

Written By: NARESH, Updated On : June 11, 2021 11:21 am
Follow us on

తెలంగాణలో సదువులు సక్కదిద్దాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు. ఇప్పటికే రెండేళ్లుగా పరీక్షలు లేకుండా ఉత్తిపుణ్యానికి విద్యార్థులను పాస్ చేయించిన కేసీఆర్ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా తరగతులు నిర్వహించి పరీక్షలు పెట్టాలని డిసైడ్ అయ్యారు.

కరోనా లాక్ డౌన్ తో పిల్లలకు వైరస్ సోకుండా గత సంవత్సరం మొదటి వేవ్ లో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేశారు. ఈ సంవత్సరం మొత్తం కరోనాతోనే పోయింది. సెకండ్ వేవ్ తో ఈ సంవత్సరం కూడా విద్యార్థులను అందరినీ పాస్ చేశారు. అయితే వచ్చే ఏడాది అలా కాకూడదని  కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

వరుసగా రెండేళ్లు పరీక్షలు లేవు. ఈ సంవత్సరం కూడా పాఠశాలలు ప్రారంభించకపోతే విద్యార్థుల భవితవ్యం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంటుంది. అందుకే కేసీఆర్ సర్కార్ ఈనెల 16 నుంచి స్కూళ్లను ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆన్ లైన్ తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటోంది. వచ్చే నెల 5 వ తేదీ నుంచి అన్ని పాఠశాలలను అన్ని తరగతులను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.

స్కూళ్లను రోజు విడిచి రోజు నిర్వహించాలని భావిస్తోంది. దీనిపై ఈ రెండు రోజుల్లోనే కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతోంది. ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు ఆసక్తి చూపడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ లేకపోవడం.. విద్యార్థులకు మౌళిక సదుపాయాలు లేక నష్టపోతున్నారు. అందుకే పాఠశాలలను పట్టాలెక్కించేందుకే కేసీఆర్ సర్కార్ రెడీ అవుతోంది. వచ్చేనెల 5 నుంచి తరగతులు ప్రారంభించేందుకు యోచిస్తోంది.  విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకునేందుకు రెడీ అయ్యింది.