ఏపీ సీఎం జగన్ తో ఢీ అంటే ఢీ అంటున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గవర్నర్ల నుంచి కేంద్రమంత్రులు, కోర్టులు, అధికారులకు ఇలా అందరికీ లేఖలు రాస్తూ సీఎం జగన్ పై ఫిర్యాదు చేస్తున్నాడు. అయితే ఇంతవరకు తన బద్ద విరోధి అయిన జగన్ కు మాత్రం రఘురామ లేఖ రాయలేదు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీర్చుకున్నాడు.
ఇప్పటికే తనను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ అమలు చేశారని.. చితక్కొట్టారని ఆరోపిస్తూ దేశంలోని సీఎంలు, కేంద్రమంత్రులు, కోర్టులకు ,ఆఖరుకు తోటి ఎంపీలకు సైతం రఘురామ లేఖలు రాశాడు. పార్లమెంట్ లో లేవనెత్తాడు. మద్దతు ఇవ్వాలని కోరారు.
అయితే అందరికీ లేఖల్లో సీఎం జగన్ పైనే ఫిర్యాదు చేస్తున్నాడు. తాజాగా ఏకంగా సీఎం జగన్ కే లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఒక పథకం కోసం.. ప్రజల కోసం అమలు చేయాలని రఘురామ లేఖ రాయడమే విచిత్రంగా ఉంది.
ఎప్పుడూ ప్రజా సమస్యలపై , తనను గెలిపించిన ప్రజల గురించి పోరాడని.. వారి సమస్యల గురించి ఆలోచించని ఎంపీ రఘురామకు సడెన్ గా వారు గుర్తుకురావడం.. వైసీపీ ప్రభుత్వం హామీనిచ్చిన వృద్ధాప్య పెంచన్ ను పెంచాలని జగన్ కు లేఖ రాయడం విశేషంగా మారింది.