
ఎంసెట్ ఆన్ లైన్ దరఖాస్తుల గడువును తెలంగాణ ఉన్నత విద్యశాఖ మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్దన్ వెల్లడించారు. తెలంగాణ ఎంసెట్ కు ఇప్పటి వరకు 2,20,027 దరఖాస్తులు, ఎంసెట్ ఇంజినీరింగ్ కు 1,46,541, అగ్రికల్చర్ కు 73,486 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.