శివసేన ప్రతీకారం: కంగన ముంబై ఆఫీస్ కూల్చివేత

సుశాంత్ సింగ్ మరణం వెనుక మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన సర్కార్ ఉందని.. వారే సుశాంత్ హత్యను తొక్కిపెడుతున్నారని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన మండిపడడం.. ఆమెకు వార్నింగ్ ఇవ్వడం.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏకంగా కంగనకు వై కేటగిరి భద్రత కల్పించడం ఇలా వరుస పరిణామాలు సెగలు రేపాయి.. Also Read: సుశాంత్-రియా కలిసే డ్రగ్స్ వ్యాపారం చేశారా? ఇక కంగనపై తాజాగా శివసేన సర్కార్ ప్రతీకారం మొదలుపెట్టింది. […]

Written By: NARESH, Updated On : September 10, 2020 8:09 pm

Kangana office

Follow us on

సుశాంత్ సింగ్ మరణం వెనుక మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన సర్కార్ ఉందని.. వారే సుశాంత్ హత్యను తొక్కిపెడుతున్నారని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన మండిపడడం.. ఆమెకు వార్నింగ్ ఇవ్వడం.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏకంగా కంగనకు వై కేటగిరి భద్రత కల్పించడం ఇలా వరుస పరిణామాలు సెగలు రేపాయి..

Also Read: సుశాంత్-రియా కలిసే డ్రగ్స్ వ్యాపారం చేశారా?

ఇక కంగనపై తాజాగా శివసేన సర్కార్ ప్రతీకారం మొదలుపెట్టింది. బుధవారం ముంబైలోని కంగన కార్యాలయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా కూల్చివేసింది. దీనిపై కంగనా రౌనత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారమే కంగన తన స్వస్థలం మనాలి నుంచి ముంబైకి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు షాకిస్తూ శివసేన సర్కార్ ఆమె కార్యాలయాన్ని కూల్చివేశారు.

ఈ ఘటనపై కంగన స్పందించింది. ‘తనకు ఆస్తి అన్నది చిన్న విషయం.. ఇవేవీ నా ఆత్మస్థైర్యాన్ని తగ్గించవు. ఇంకా పెంచుతాయి’ అని మహారాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చింది. బాబర్ ఆర్మీ తన రామ మందిరాన్ని కూలుస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. నా శత్రువులు నా మాటలన్ని నిజం చేస్తున్నారని.. ముంబైని అందుకే తాను పీవోకే తో పోల్చానని కంగన ట్వీట్ లో నిప్పులు చెరిగారు.

Also Read: కాంగ్రెస్‌లో సీనియర్‌‌ నేతలు వర్సెస్‌ యువనేతలు

https://twitter.com/KanganaTeam/status/1303569152917946368?s=20