కేసీఆరా..మజాకా? మొత్తం బుల్లెట్ ఫ్రూఫ్ పో..!

తెలంగాణ సచివాలయం నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్మాత్మంగా తీసుకున్న సంగతి తెల్సిందే. సచివాలయ నిర్మాణానికి ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించిన సీఎం కేసీఆర్ చాణిక్యంతో లైన్ క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్లారు. సచివాలయం విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. హైకోర్టులో కొంత జాప్యం జరిగినా.. న్యాయంపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా పకడ్బంధీ చర్యలు తీసుకోని చివరికీ హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. దీంతో సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. Also […]

Written By: NARESH, Updated On : September 9, 2020 3:20 pm

Bullet pfoor secreteriat

Follow us on

తెలంగాణ సచివాలయం నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్మాత్మంగా తీసుకున్న సంగతి తెల్సిందే. సచివాలయ నిర్మాణానికి ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించిన సీఎం కేసీఆర్ చాణిక్యంతో లైన్ క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్లారు. సచివాలయం విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. హైకోర్టులో కొంత జాప్యం జరిగినా.. న్యాయంపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా పకడ్బంధీ చర్యలు తీసుకోని చివరికీ హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. దీంతో సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.

Also Read: బాలకృష్ణను కెలికిన పోసాని… ఏం జరిగిందంటే….?

కేసీఆర్ కలలు కంటున్న తెలంగాణ సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ కావడంతో చకచక పనులు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే పాత సచివాలయాన్ని కూల్చివేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ క్యాబినెట్ సైతం ఆమోదముద్ర వేసింది. 500కోట్ల భారీ బడ్జెట్ తో సచివాలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అయితే ప్రస్తుతం ఆ లెక్క రూ.700కోట్ల చేరబోతుందని టాక్ విన్పిస్తోంది.

తెలంగాణ సచివాలయంలో సీఎం ఛాంబర్ కే ఏకంగా రూ.50కోట్ల మేర ఖర్చు చేస్తున్నారట. దేశంలో ఎక్కడ లేనివిధంగా సీఎం ఛాంబర్ పూర్తిగా బుల్లెట్ ఫ్రూవ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సచివాలయం చుట్టుపక్కల.. సుదూరం నుంచి ఎలాంటి దాడులు జరిగినా ఎలాంటి నష్టం జరుగకుండా ఏర్పాట్లు చేయబోతున్నారట. సీఎం కేసిఆర్ విజన్ మేరకే సచివాలయ నిర్మాణంలో అధికారులు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

25ఎకరాల్లో ఏడు అంతస్థులతో ఆరులక్షల చదరపు అడుగుల మేరకు సెక్రటేరియట్ నిర్మాణం ఉండనుంది. వేలాది వాహనాలు పార్క్ చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. అదే సమయంల గ్రీనరీకి విపరీతమైన ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. లాండ్ స్కేపింగ్ కోసం జాతీయ స్థాయిలో డిజైన్లు రూపొందించారు. ఇక సచివాలయ భవనంలో ఇంటిరియల్ కోసమే రూ.200కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. భవనంలో ఎక్కడ చూసిన విదేశీ ఫర్మిచర్ కన్పిస్తుందట.

Also Read: ప్రజలకు అవినీతి రహిత సేవలు: కేసీఆర్

సచివాలయం భవనం రాజసం ఉట్టిపడేలా.. తెలంగాణ ప్రతిష్టను పెంచేలా సచివాలయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఒక్క సచివాలయ భవన నిర్మాణం కోసమే ప్రభుత్వం ఏకంగా రూ.700కోట్ల ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కేసీఆర్ చెప్పిన మాటలకు.. చేతలకు ఎక్కడా పోతన లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సచివాలయం భవన నిర్మాణం తప్పనిసరికాకపోయినా.. సీఎం కేసీఆర్ కమిషన్ల కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!