https://oktelugu.com/

కాంగ్రెస్‌లో సీనియర్‌‌ నేతలు వర్సెస్‌ యువనేతలు

‘పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలి. పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలి. ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేతలు రాసిన లేఖను మరిచిపోకముందే.. బహిష్కృత నేతలు సోనియాకు మరో లేఖను రాశారు. ‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ కాంగ్రెస్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ నిర్మితమైంది. దేశంలో ప్రజాస్వామ్య పునాదులు కూడా వేశారు. కొంత కాలంగా పార్టీని నడుపుతున్న విధానాన్ని చూస్తుంటే సాధారణ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని, నిరాశను కలిగిస్తోంది.’ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2020 3:24 pm
    Follow us on

    ‘పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలి. పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలి. ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేతలు రాసిన లేఖను మరిచిపోకముందే.. బహిష్కృత నేతలు సోనియాకు మరో లేఖను రాశారు. ‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ కాంగ్రెస్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ నిర్మితమైంది. దేశంలో ప్రజాస్వామ్య పునాదులు కూడా వేశారు. కొంత కాలంగా పార్టీని నడుపుతున్న విధానాన్ని చూస్తుంటే సాధారణ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని, నిరాశను కలిగిస్తోంది.’ అంటూ పేర్కొన్నారు. వీటన్నింటి పరిశీలిస్తే.. అటు సీనియర్‌‌ నేతలు, ఇటు యువ నేతల మధ్య పార్టీలో పొసగడం లేదనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    Also Read: శివసేన ప్రతీకారం: కంగన ముంబై ఆఫీస్ కూల్చివేత

    వందేళ్లకు పైగా చరిత్ర.. ఎంతో మంచి రాజకీయ ఉద్ధండులు ఉన్న పార్టీ.. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ.. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పుడు కొట్లాటలు నడుస్తున్నాయి. అధికార సంక్షోభం ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలను వెలుగులోకి తెచ్చింది. సోనియా గాంధీకి విధేయులుగా ఉన్న సీనియర్‌‌ నేతలకు, యువ నేత రాహుల్‌ గాంధీ నాయకత్వం ఉన్న నేతలకు ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరుకుందని చెప్పొచ్చు. ఇటీవల పార్టీని మరోమారు పటిష్టం చేయడానికి యువ నాయకత్వం తీసుకురావాలని యువనేతలు పట్టుబడుతుండగా.. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియానే మరోసారి పగ్గాలు చేపట్టేలా సీనియర్లు చేశారన్నది పార్టీలో నడుస్తున్న టాక్‌.

    అంత పెద్ద చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో సంక్షేభాలు కొత్తేమీ కాదనే చెప్పాలి. దేశ కాంగ్రెస్‌లోనే కాదు.. రాష్ట్ర కాంగ్రెస్‌లలోనూ పార్టీ పరిస్థితి అంతే. ఎప్పుడూ కుమ్ములాటలు.. ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంటాయి. జాతీయ స్థాయిలో నెహ్రూ, ఇందిర గాంధీలూ సంక్షోభాలను అనుభవించారు. అప్పటి నుంచి ఆ సంక్షోభాలను లైట్‌గానే తీసుకుంటున్న అధినాయకత్వానికి ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు తలనొప్పిలా మారాయి. ఇప్పుడు జరుగుతున్న గొడవలే నాయకత్వం అజెండాగా మారడం అనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ స్థాపించినప్పటి నుంచీ అందులో వారసత్వ రాజకీయమే నడుస్తోంది. దీనిని ఎవరూ కాదనలేరు కూడా. అదే వారసత్వాన్ని అందిపుచ్చుకొని తల్లి సోనియా నుంచి రాహుల్‌ పార్టీ పగ్గాలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. గత ఎన్నికల్లో ఓటమి కారణంగా రాహుల్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పడు ఇదే పార్టీలో నాయకత్వ సంక్షోభానికి కారణమైనట్లుగా ప్రచారం జరుగుతోంది.

    Also Read: ప్రజలకు అవినీతి రహిత సేవలు: కేసీఆర్

    పార్టీలో అధినేత్రి సోనియాగాంధీకి వయసు మళ్లిన సీనియర్లు అండగా నిలుస్తుండగా.. ఆమె తనయుడు రాహుల్‌ గాంధీకి యువతరం నేతలు మద్దతుగా ఉంటున్నారు. వీరిద్దరికీ మధ్య సున్నితంగా జరిగిపోవాల్సిన నాయకత్వ మార్పు కొట్లాటగా మారింది. ఫలితంగా పార్టీలో సంక్షోభం మొదలైంది. పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నాయకత్వ సంక్షోభం వెనుక సోనియా, రాహుల్‌ కోటరీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరే కారణమన్నది తెలుస్తూనే ఉంది. అయితే దీని వెనుక అసలు కారణం గమనిస్తే నేతల్లో నెలకొన్న అభద్రతా భావమే అన్నది అర్థమవుతోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య అధినేత్రి సోనియా కానీ.. అటు రాహుల్‌ కానీ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి ఎటూ పరిష్కారం చూపలేకపోతున్నారు.