కాళేశ్వరం నీళ్లు ఏడ పాయె..!

తెలంగాణ రాష్ట్ర సీఎం కలల ప్రాజెక్టు కాళేశ్వరం. 1.14 లక్షల కోట్ల ఖర్చు.. అంత ఖర్చు పెట్టి నిర్మించిన ఈ ప్రాజెక్టు రైతాంగాన్ని ఏమైనా ఆసరా అయిందా అంటే ఒక్క టీఎంసీని వాడుకోలేని పరిస్థితి. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి భారీ వర్షాలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. గేట్లు సైతం తెరుచుకున్నాయి. ఇంకేముంది.. ఈ సారి కాళేశ్వరం నీళ్లు అవసరం లేకుండా రాష్ట్రంలో 85 లక్షల ఎకరాల సాగు వానల […]

Written By: NARESH, Updated On : September 3, 2020 4:26 pm
Follow us on


తెలంగాణ రాష్ట్ర సీఎం కలల ప్రాజెక్టు కాళేశ్వరం. 1.14 లక్షల కోట్ల ఖర్చు.. అంత ఖర్చు పెట్టి నిర్మించిన ఈ ప్రాజెక్టు రైతాంగాన్ని ఏమైనా ఆసరా అయిందా అంటే ఒక్క టీఎంసీని వాడుకోలేని పరిస్థితి. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి భారీ వర్షాలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. గేట్లు సైతం తెరుచుకున్నాయి. ఇంకేముంది.. ఈ సారి కాళేశ్వరం నీళ్లు అవసరం లేకుండా రాష్ట్రంలో 85 లక్షల ఎకరాల సాగు వానల కిందనే సాగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కోటి 26 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే.. మేజర్‌‌ పార్ట్‌ అంతా కూడా వానల మీద ఆధారపడే రైతులు పంటలు వేశారు.

ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే రాష్ట్రంలోని పంటలకు పాత ప్రాజెక్టులే ప్రాణాధారం అయ్యాయి. భారీగా కురిసిన వానలు, బావులు, బోర్లు పంపు సెట్లు నిండి రైతాంగాన్ని ఆదుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సారి 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే.. ఇందులో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టు కేవలం 41 లక్షల ఎకరాలు. అంటే మూడో వంతులోపే అన్నట్లు. ప్రాజెక్టుల రీ డిజైన్‌తో కోటి ఎకరాల మాగాణికి సాగునీరందిస్తామని సీఎం కేసీఆర్‌‌ మైక్‌ పట్టుకున్నప్పుడల్లా చెబుతుంటారు. కానీ.. ఈ సారి కేవలం 41 లక్షల ఎకరాలకే ప్రాజెక్టుల ద్వారా నీళ్లిచ్చేందుకు ప్రిపేర్‌‌ అయినట్లు ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ చెబుతోంది. అంటే గడిచిన ఆరేళ్లలో ఇలాంటి పరిస్థితి ఇదే ఫస్ట్‌ టైం అని చెప్పొచ్చు.

ఈ ఏడాది రాష్ట్రంలో 46 శాతం అదనంగా వానలు పడ్డాయి. దానికి అనుగుణంగా పంటల విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో 560.4 మిల్లీమీటర్ల వర్షపాతం అంచనా వేయగా.. వారం రోజుల క్రితం వరకే 819 మి.మీ. వర్షపాతం నమోదైంది. 14 జిల్లాల్లో భారీ వర్షాలు పడగా.. 11 జిల్లాల్లో అధికంగా.. 8 జిల్లాల్లో సాధారణ రెయిన్‌ ఫాల్‌ రికార్డయింది. ఈ సీజన్‌కు 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. ఇప్పటికే 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు ప్రభుత్వం లెక్కలేసింది.

ప్రాజెక్టుల కింద సాగులోకి వచ్చిన భూముల్లో ఎక్కువగా శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్ట్‌ కిందనే ఉన్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టు కింద 16.21 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎస్సారెస్పీ స్టేజీ 1,2 సదర్మాట్‌, చౌట్పల్లి హన్మంతరెడ్డి, అలీసాగర్‌‌, గుత్ప లిఫ్ట్‌ స్కీంలు, ఐడీసీ స్కీములతో ఈ నీరు ఇవ్వనున్నారు. నాగార్జునసాగర్‌‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్‌‌ ఎస్‌ఎల్బీసీ కింద మరో 8.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుండగా.. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌‌, కల్వకుర్తి లిఫ్ట్‌ స్కీంలు, ఆర్డీఎస్‌ కింద మ్మడి మహబూబ్‌నగర్‌‌ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీరందించాలని ప్రతిపాదించారు. ఇవన్నీ కూడా ఉమ్మడి ఏపీలో నిర్మించిన ప్రాజెక్టులే.

కేసీఆర్‌‌ సర్కార్‌‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.1.14 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీటితోనే రాష్ట్రంలో కోటి ఎకరాల సాగు విస్తీర్ణం అవుతున్నట్లు మరో వైపు ప్రభుత్వం షో చేసుకుంటోంది. కానీ.. వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ ఏడాది కాళేశ్వరంతో ప్రభుత్వం ఒక్క ఎకరం ఆయకట్టును కూడా ప్రతిపాదించలేదు. ఎగువన కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీ జలకళను సంతరించుకోగా.. ఎల్లంపల్లి దిగువన గోదావరి ఉరకలేస్తోంది. ఎప్పుడూ కాళేశ్వరం మీదనే దృష్టి పెట్టిన కేసీఆర్‌‌ ఎల్లంపల్లి నీటిని వినియోగంలోకి తీసుకురావడంలో ఫెయిల్‌ అయినట్లు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. గోదావరితో నిండిపోయిన ఎల్లంపల్లి నుంచి మళ్లీ 16 టీఎంసీల నీటిని గోదాట్లోకే వదిలేశారు. అటు కాళేశ్వరమూ.. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఈ సీజన్‌కు నిరుపయోగంగానే మారాయి.

-శ్రీని