భారత్ సత్తా.. పాక్‌కు మరోసారి ఎదురుదెబ్బ

అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక ప్రేరేపిత చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది ఇండియా మీద పాకిస్థాన్‌. కశ్మీర్‌‌ను కైవసం చేసుకోవడానికి ఉగ్ర చర్యలకూ వెనకాడదు. మన భారత సైన్యం ఎన్ని సార్లు తిప్పికొట్టినా.. కేంద్రం ఎన్నిసార్లు దీటుగా సమాధానం ఇచ్చినా పాక్‌ తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. దెబ్బ మీద దెబ్బ పడుతున్నా తన కుట్రలను వీడడం లేదు. ఐక్యరాజ్యసమితిలోనూ దేశాలన్నీ పాక్‌తో విబేదించినా కుఠిల రాజకీయాలు చేస్తూనే ఉంది. తాజాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (యూఎన్‌ఎస్‌సీ)లో […]

Written By: NARESH, Updated On : September 3, 2020 3:29 pm
Follow us on


అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక ప్రేరేపిత చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది ఇండియా మీద పాకిస్థాన్‌. కశ్మీర్‌‌ను కైవసం చేసుకోవడానికి ఉగ్ర చర్యలకూ వెనకాడదు. మన భారత సైన్యం ఎన్ని సార్లు తిప్పికొట్టినా.. కేంద్రం ఎన్నిసార్లు దీటుగా సమాధానం ఇచ్చినా పాక్‌ తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. దెబ్బ మీద దెబ్బ పడుతున్నా తన కుట్రలను వీడడం లేదు. ఐక్యరాజ్యసమితిలోనూ దేశాలన్నీ పాక్‌తో విబేదించినా కుఠిల రాజకీయాలు చేస్తూనే ఉంది.

తాజాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (యూఎన్‌ఎస్‌సీ)లో మరోసారి పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తాకింది. భద్రతా మండలిలో ఇద్దరు భారతీయులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ పాకిస్థాన్‌ చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి తిరస్కరించింది. అసలు ఉగ్రవాదులను తన దేశంలోనే పెట్టుకొని భారతీయులను ఉగ్రవాదులుగా చేర్చడంపై భారత్‌ ఫైర్‌‌ అయింది.

ఉగ్రవాదంపై మతపరమైన రంగును పులమడం ద్వారా 1267 ప్రత్యేక విధానాన్ని రాజకీయం చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి బుధవారం తెలిపారు. యూఎన్‌ఎస్‌సీ యొక్క 1267 ఉగ్రవాద నిరోధక ఆంక్షల కమిటీ కింద అంగార అప్పాజీ, గోవింద పట్నాయక్ అనే ఇద్దరు భారతీయులను ఉగ్రవాద కార్యకర్తలుగా గుర్తించే చర్యను పాకిస్తాన్ ప్రారంభించింది. అందుకే ఈ చర్యను తిప్పికొట్టినట్లు వెల్లడించారు.

అయితే ఈ ఆరోపణలకు మద్దతు ఇవ్వడానికి ఆధారాలు సమర్పించడంలో పాకిస్థాన్ విఫలమైంది. ఏ ఆరోపణ చేసినా పాక్‌ వాటిని నిరూపించడంలో విఫలం అవుతూనే ఉంటుంది. కానీ.. బుద్ధిమాంద్యంతో ఎప్పటికప్పుడు భారత్‌పై ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. తాజాగా చేసిన ఆరోపణల నేపథ్యంలో అమెరికా, యుకె, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం నేతృత్వంలోని యూఎన్‌ఎస్‌సీ పాకిస్థాన్ చర్యను అడ్డుకోవాలని నిర్ణయించింది. ఉగ్రవాదంపై మతపరమైన రంగును పులమడం ద్వారా 1267 ప్రత్యేక విధానాన్ని రాజకీయం చేయటానికి పాకిస్థాన్ చేసిన విఫల ప్రయత్నాన్ని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అడ్డుకుందని.. ఈ పాకిస్తాన్ చర్యను అడ్డుకున్న కౌన్సిల్ సభ్యులందరికీ కృతజ్ఞతలు అని టీఎస్ తిరుమూర్తి ట్వీట్ చేశారు.