https://oktelugu.com/

ట్రంప్ జోలికి వెళ్లే సత్తా బైడెన్ కు ఉందా..!

2020 నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. రిపబ్లిక్ పార్టీ తరుఫున డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాట్ల తరుపున బైడెన్ పోటీ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌కు 306ఎల‌క్టోర‌ల్ ఓట్లు పోల‌వ్వ‌గా.. ట్రంప్‌కు 232 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. Also Read: న్యూఇయర్ వేడుకలపై బ్యాన్ విధించిన కర్ణాటక.. ఎందుకంటే? బైడెన్ కు అధ్యక్ష పదవీ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే ఓట్లు వచ్చాయి. అయితే ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించకపోవడంతో అమెరికా అధ్యక్షుడి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 18, 2020 / 06:04 PM IST
    Follow us on

    2020 నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. రిపబ్లిక్ పార్టీ తరుఫున డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాట్ల తరుపున బైడెన్ పోటీ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌కు 306ఎల‌క్టోర‌ల్ ఓట్లు పోల‌వ్వ‌గా.. ట్రంప్‌కు 232 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

    Also Read: న్యూఇయర్ వేడుకలపై బ్యాన్ విధించిన కర్ణాటక.. ఎందుకంటే?

    బైడెన్ కు అధ్యక్ష పదవీ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే ఓట్లు వచ్చాయి. అయితే ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించకపోవడంతో అమెరికా అధ్యక్షుడి ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది.

    ఈక్రమంలోనే ఇటీవల ట్రంప్ తన అమెరికా రాజ్యాంగంపై గౌరవం ఉందని.. అయితే తన పోరాటం మాత్రం కొనసాగుతుందని తెలిపి అధ్యక్ష పదవీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అమెరికా అధ్యక్షుడి ఎంపికకు మార్గం సుగమం అయింది.

    ఇటీవలే అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ గెలుపును ఎల‌క్టోర‌ల్ కాలేజీ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈనెల 20న అమెరికా 46వ అధ్యక్షుడి జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. దీంతో ఈలోపు ట్రంప్ అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది.

    Also Read: కల్లోల 2020: క్రిస్మస్ వేళ భయపెడుతున్న ప్రకృతి

    అయితే ట్రంప్ మాత్రం తాను అధ్యక్ష భవనం ఖాళీ చేసేది లేదని తేల్చి చెబుతున్నాడు. ఒకవేళ ట్రంప్ అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేయకుంటే మాత్రం రాజ్యాంగపరంగా సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.

    ఇదివరకు జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన అధ్యక్షులంతా తామంత తామే గౌరవంగా తప్పుకున్నారు. ట్రంప్ మాత్రం తాను ఓడిపోలేదని.. అందుకే ఖాళీ చేయనని తన స్టైల్లో చెబుతున్నాడు.

    దీంతో ఆయనను ఖాళీ చేయించేందుకు అధికారులు నానాతంటాలు పడుతున్నారు. దీంతో ట్రంప్ అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేస్తారా? లేదా అన్న ఆసక్తి అమెరికన్లతోపాటు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు