ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఏపీ సీఎం జగన్ మధ్య పంతం కొనసాగుతూనే ఉంది. ఇద్దరూ ఎవరూ తగ్గకపోవడంతో ఈ వార్ సెగలు పుట్టిస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి నిమ్మగడ్డ మొండిగా ముందుకెళుతుండగా.. జరగనీయకుండా జగన్ సర్కార్ పట్టుదలతో ఉంది.
Also Read: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలివీ
ఈ క్రమంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ తాజాగా జగన్ సర్కార్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మగడ్డ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి సంచలనం సృష్టించాడు.
జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సహకరించలేదని, గతంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్వహించడం ఎస్‌ఇసి నిమ్మగడ్డ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ వేశారు. తన చేతుల్లోనే అధికారం ఉన్నా జగన్ సర్కార్ వల్ల ఎన్నికలు నిర్వహించలేకపోతున్నానని తెలిపాడు..
Also Read: కల్లోల 2020: క్రిస్మస్ వేళ భయపెడుతున్న ప్రకృతి
కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ కె ద్వివేదిలకు పలు లేఖలు రాసినప్పటికీ, ఇప్పటి వరకు వారి నుండి సరైన స్పందన రాలేదని నిమ్మగడ్డ పిటీషన్ లో పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఇసికి నిధులు విడుదల చేయడం లేదని, కమిషన్‌లో పెండింగ్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం లేదని ఆరోపించారు. ఓటరు జాబితాల తయారీలో ఎస్‌ఇసికి సహాయం చేయడం లేదని నిమ్మగడ్డ ఆరోపించారు.
హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాటించడం లేదని, తన లేఖలను పట్టించుకోలేదని నిమ్మగడ్డ ఆరోపించారు. జగన్ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని.. ఎన్నికల విధుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు తెలిపిందని గుర్తు చేశారు. ఎస్ఈసీ ఏకంగా కోర్టు ధిక్కార పిటీషన్ వేయడంతో ఈ వ్యవహారంలో ఇరుక్కున్న ఏపీ సర్కార్ ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్