అట్రాసిటీ కేసులతో జగన్ సర్కార్ తమను వేధిస్తోందని.. తనపై కూడా ఓ కేసు పెట్టారని.. ఈ కేసులు పరిష్కరించే వరకు తాడిపత్రిలో ఈనెల 4 నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నట్టు అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఏపీ రాజకీయాలను పట్టించుకోవడం లేదని.. మా రాష్ట్రం భారతదేశంలో భాగం కాదా అని జేసీ వాపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని ఎన్నికల సమయంలో అట్రాసిటీ కేసులు పెట్టి లోపల వేసేందుకు ఇలా చేస్తున్నారని జేసీ ఆరోపించారు.
Also Read: బీజేపీ వర్సెస్ జనసేన..: ఆ సీటు కోసమేనా..?
తనపై రెండేళ్ల కిందటి పాత కేసు తవ్వితీసి అట్రాసిటీ కింద పెట్టారని జేసీ ఆరోపించారు. రెండేళ్ల కిందట.. ప్రభోదనంద ఆశ్రమంపై దాడి కేసును తనపై తాజాగా అట్రాసిటీ కింద పెట్టారని జేసీ ఆరోపించారు. కులం పేరుతో సీఐని దూషించినట్లుగా తప్పుడు కేసు పెట్టారని జేసీ వాపోయారు. ఆ సీఐ కులం ఏదో కూడా తనకు తెలియదు అని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.
మా ఇంట్లోనే కులాంతర వివాహాలు చేసుకున్నామని.. ఇంకా కులం ఎక్కడ ఉందని జేసీ ప్రశ్నించారు. అట్రాసిటీ కేసును రాజకీయంగా జగన్ సర్కార్ వాడుకుంటోందని విమర్శలు గుప్పించారు.
Also Read: శ్రీరాముడి చుట్టే ఏపీ రాజకీయాలు..: రామతీర్థానికి చంద్రబాబు
అందుకే ఈనెల 4 నుంచి తమపై పెట్టిన అట్రాసిటీ కేసులను తేల్చే వరకు ఆమరణ దీక్ష చేస్తున్నట్టు జేసీ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రధాన మంత్రి మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని జేసీ డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్