https://oktelugu.com/

జాతిరత్నం నవీన్ పోలిశెట్టి హిందీ మూవీ కష్టాలు కన్నీళ్లు..

జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో నవీన్ పోలిశెట్టి కష్టాలు మామూలుగా లేవు. ఆయన హిందీ అవకాశం కోసం ఏకంగా లండన్ నుంచి సాఫ్ట్ వేర్ జాబ్ వదలుకొని వచ్చాడట.. అంతేకాదు.. డబ్బులు లేక మొబైల్ షాపుల ముందు సేల్స్ మ్యాన్ గా చేశాడట.. బ్రౌన్ రైస్ అమ్మాడట… హిందీలో ఒకరిని పిలవబోయి మరొకరిని పిలిచారని.. అలా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో గా వచ్చిన ‘చిచోరీ’లో పొరపాటున తనకు అవకాశం వచ్చిందని […]

Written By:
  • NARESH
  • , Updated On : March 24, 2021 / 10:28 PM IST
    Follow us on

    జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో నవీన్ పోలిశెట్టి కష్టాలు మామూలుగా లేవు. ఆయన హిందీ అవకాశం కోసం ఏకంగా లండన్ నుంచి సాఫ్ట్ వేర్ జాబ్ వదలుకొని వచ్చాడట.. అంతేకాదు.. డబ్బులు లేక మొబైల్ షాపుల ముందు సేల్స్ మ్యాన్ గా చేశాడట.. బ్రౌన్ రైస్ అమ్మాడట…

    హిందీలో ఒకరిని పిలవబోయి మరొకరిని పిలిచారని.. అలా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో గా వచ్చిన ‘చిచోరీ’లో పొరపాటున తనకు అవకాశం వచ్చిందని నవీన్ పోలిశెట్టి తన సినిమా కష్టాలు చెప్పుకొచ్చాడు.

    ముంబైలో అవకాశాల కోసం 50సార్లు ఆడిషన్ ఇచ్చినా నాకు చాన్స్ రాలేదని.. వేరే నవీన్ నూలీకి రాబోయి నాకు అవకాశం వచ్చిందని.. నా యూట్యూబ్ చానెల్ పర్ ఫామెన్స్ కారణంగా తనకు అవకాశం వచ్చి చిచోరిలో యాసిడ్ పాత్ర పోషించాని తెలిపారు.

    నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే తనకు తెలుసు అని.. ఆ పరిచయంతోనే తనకు జాతిరత్నం మూవీలో అవకాశం ఇచ్చాడని.. మేం ముగ్గురం కలిసి కథను డెవలప్ చేసి సినిమాను తీశామని నవీన్ పోలిశెట్టి తన సినిమా కష్టాలు చెప్పుకొచ్చాడు.