https://oktelugu.com/

టైమ్స్ నౌ సర్వే: 5 రాష్ట్రాల్లో ఎవరిది గెలుపంటే?

త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కనీసం ఒక్క రాష్ట్రమైన బీజేపీ చేజిక్కితుందా అని అనుమాన పడుతున్న వేళ టౌమ్స్ నౌ-సీఓటర్ సర్వే’లో ఒక రాష్ట్రమే కాదు.. మరో కేంద్రపాలిత ప్రాంతం కూడా బీజేపీ వశం అవుతుందని తేలింది. అయితే బెంగాల్ పై యుద్ధం ప్రకటించిన బీజేపీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. అక్కడ మమత బెనర్జీని కొట్టడం సాధ్యం కాదని తేలింది. టైమ్స్ నౌ ఓపినియన్ పోల్ లో తాజాగా ఐదు రాష్ట్రాల్లో గెలుపు ఎవరిది […]

Written By: , Updated On : March 25, 2021 / 08:54 AM IST
Follow us on

త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కనీసం ఒక్క రాష్ట్రమైన బీజేపీ చేజిక్కితుందా అని అనుమాన పడుతున్న వేళ టౌమ్స్ నౌ-సీఓటర్ సర్వే’లో ఒక రాష్ట్రమే కాదు.. మరో కేంద్రపాలిత ప్రాంతం కూడా బీజేపీ వశం అవుతుందని తేలింది. అయితే బెంగాల్ పై యుద్ధం ప్రకటించిన బీజేపీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. అక్కడ మమత బెనర్జీని కొట్టడం సాధ్యం కాదని తేలింది.

టైమ్స్ నౌ ఓపినియన్ పోల్ లో తాజాగా ఐదు రాష్ట్రాల్లో గెలుపు ఎవరిది అని సర్వే చేశారు. ఇందులో బెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు సాధించబోదని సర్వే తేల్చింది. అయితే అసోం రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని.. పుదుచ్చేరిలో ఘన విజయం సాధిస్తుందని తేలింది.

ఇక కీలకమైన తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి పరాభవాన్ని మిగులుస్తుందని.. డీఎంకే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది. కేరళలో వామపక్ష కూటమికే ఈ దఫా కూడా సీట్లు తగ్గినప్పటికీ అధికారం సాధిస్తుందని తేలింది.

*టైమ్స్ నౌ సర్వే ప్రకారం..
పశ్చిమ బెంగాల్ (294) లో తృణమూల్ కు 152-168, బీజేపీకి 104-120, కాంగ్రెస్ కూటమి 18-26

-అసోం (126)లో
ఎన్డీఏ 65-73, మహాజోత్ 52-60, ఇతరులు 0-4

-తమిళనాడు (234)లో
డీఎంకే కూటమికి173-181, అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి 45-53, ఎంఎన్ఎం 1-5

-కేరళ (140)లో
ఎల్ డీఎఫ్ 77, యూడీఎఫ్ 62 స్థానాలు

-పుదుచ్చేరి (30)లో
ఎన్డీఏ 19-23, కాంగ్రెస్ డీఎంకే 7-11

మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో బలమైన బెంగాల్ లో బీజేపీ గెలవదని తేలిపోయింది. చిన్న రాస్ట్రమైన అసోం మరియు పుదుచ్చేరిలకు మాత్రమే బీజేపీ పరిమితం కానుంది.