https://oktelugu.com/

వ్యాన్ లోయలో పడి ఏడుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్ లోని ఓ వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. చంఢీగర్-మనాల నేషనల్ హైవే మండి సమీపంలోని పుల్ఘ్రత్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ప్యాసింజర్ వాహనం అదుపుతప్పి సుకేత్ ఖాద్ లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీస్ అధికారి వినోద్ ఠాకూర్ తో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీప […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 16, 2020 / 10:35 AM IST
    Follow us on

    హిమాచల్ ప్రదేశ్ లోని ఓ వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. చంఢీగర్-మనాల నేషనల్ హైవే మండి సమీపంలోని పుల్ఘ్రత్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ప్యాసింజర్ వాహనం అదుపుతప్పి సుకేత్ ఖాద్ లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీస్ అధికారి వినోద్ ఠాకూర్ తో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.