నిమ్మగడ్డతో జగన్ సర్కార్ రాజీ?

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో జగన్ సర్కార్ రాజీకి వచ్చిందా? ఎస్ఈసీతో సామారస్యంగా ముందుకెళుతోందా? ఏపీ సీఎస్, డీజీపీ ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తో జరిగిన భేటిలో ప్రభుత్వ ప్రతిపాదనలను ఆయన ముందుంచారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డతో సీఎస్ ఆధిత్యనాథ్ దాస్, డీజీపీ , ఉన్నతాధికారులు భేటి అయ్యారు. పంచాయతీ ఎన్నికల తర్వాత మిగిలిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపలల్ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించే […]

Written By: NARESH, Updated On : February 12, 2021 11:26 am
Follow us on

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో జగన్ సర్కార్ రాజీకి వచ్చిందా? ఎస్ఈసీతో సామారస్యంగా ముందుకెళుతోందా? ఏపీ సీఎస్, డీజీపీ ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తో జరిగిన భేటిలో ప్రభుత్వ ప్రతిపాదనలను ఆయన ముందుంచారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డతో సీఎస్ ఆధిత్యనాథ్ దాస్, డీజీపీ , ఉన్నతాధికారులు భేటి అయ్యారు. పంచాయతీ ఎన్నికల తర్వాత మిగిలిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపలల్ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించే అవకాశాలపై ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన ముందుంచారు. అయితే దీనిపై స్పందించని ఎస్ఈసీ నిమ్మగడ్డ పరిశీలించి చెబుతానని దాటవేయడం గమనార్హం.

ఏపీలో పంచాయతీ ఎన్నికలపై జగన్ సర్కార్ తో యుద్ధం చేసిన నిమ్మగడ్డ ప్రస్తుతం మెత్తబడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తనను కలిసిన సీఎస్, డీజీపీలతో ఉల్లాసంగా మాట్లాడినట్టు సమాచారం. వీరంతా మిగతా ఎన్నికలను ఎలా పూర్తి చేయాలనే దానిపై చర్చించినట్టు సమాచారం. దీంతో నిమ్మగడ్డతో ఫైట్ కు స్వస్తి పలికి జగన్ సర్కార్ రాజీకి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వైఖరి మారినట్టుగా తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికలు ముగిశాక స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న జగన్ సర్కార్ ప్రతిపాదనకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు పరిశీలిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

మార్చి 31లోపు నిమ్మగడ్డ పదవీకాలం ముగుస్తోంది. ఆ లోపే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ముగించి వెళ్లిపోవాలనేది నిమ్మగడ్డ ఆలోచన. దీంతో ప్రభబుత్వమే అందుకు ఉత్సాహం చూపడంతో నిమ్మగడ్డకు లైన్ క్లియర్ అయ్యింది.

మార్చి 31లోపు నిమ్మగడ్డ పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలు నిర్వహిస్తే ఆయన రిటైర్ కావడానికి ఏలాంటి అడ్డంకులు ఉండవు. ఎన్నికల మధ్యలో రిటైర్ కావడానికి వీల్లేదు. దీంతో జగన్ సర్కార్ ఆయనను పొడిగించాల్సి ఉంటుంది. అందుకే జగన్ వ్యూహాత్మకంగానే నిమ్మగడ్డ హయాంలోనే ఎన్నికలు ముగించడానికి తొందరపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక నెలాఖరులో తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుండడంతో దానిపైనా దృష్టి సారించేందుకు మార్గం సుగమం అవుతుంది. అందుకే జగన్ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.