
సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలలో చాలామంది విమాన టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో విమానంలో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపరు. అత్యవసరమైతే మాత్రమే విమానంలో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే విమానంలో ప్రయాణించాలని భావించే వాళ్లకు మరో భారీ షాక్ తగిలింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ విమాన టికెట్ రేట్లకు సంబంధించిన ప్రైస్ బ్యాండ్ ను పెంచింది.
Also Read: తక్కువ పెట్టుబడితో డబ్బులు సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?
కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రభావం తరచూ విమానాలలో ప్రయాణం చేసే ప్రయాణికులపై పడనుంది. కనీసం 10 శాతం నుంచి గరిష్టంగా 30 శాతం వరకు విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం ఉత్తర్వుల ప్రకారం పెరిగిన టికెట్ ధరలు మార్చి 31 వరకు అమలులో ఉండనున్నాయి. ఆ తరువాత కేంద్రం విమాన టికెట్ ధరలను పెంచడం లేదా తగ్గించడం జరుగుతుంది.
Also Read: హెలికాప్టర్ కొనుక్కోవడానికి రుణం.. రాష్ట్రపతికి మహిళ రాసిన లేఖ వైరల్..!
పెరిగిన విమాన టికెట్ ధరలకు ఎయిర్‌పోర్ట్ యూజర్ డెవలప్‌మెంట్ చార్జీలు జీఎస్‌టీ, ప్యాసింజర్ సేఫ్టీ చార్జీలు అదనంగా ఉండనున్నాయి. సాధారణంగా రూ.3,500 నుంచి రూ.10,000 వరకు ఢిల్లీ నుంచి ముంబైకు టికెట్ ధరలు ఉండగా కొత్త రేట్ల ప్రకారం ఈ ధరలు 3,900 రూపాయల నుంచి 13,000 రూపాయల వరకు ఉండనున్నాయని సమాచారం. గతేడాది మే నెలలో కేంద్రం ప్రైస్ బ్యాండ్ లను ప్రకటించింది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
కరోనా విజృంభణ తరువాత విమానాలలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా తగ్గింది. ఇలాంటి తరుణంలో విమాన ఛార్జీలను పెంచితే విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా తగ్గే అవకాశాలు ఉంటాయి.