అమరావతి ప్రాజెక్టుల్లో కదలిక.. కీలకంగా శ్రీలక్ష్మీ

రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ.. 400 రోజులకు పైగా సాగుతున్న ఉద్యమంపై జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రాంత పరిధిలోని స్తంభించిపోయిన ప్రాజెక్టులు, భవనాల నిర్మాణాలపై భవిష్యత్ ను నిర్ధారించబోతోంది. మూడు రాజధానుల నేపథ్యంలో అమరావతిలో భవనాలు నిర్మించాలా..? లేదా..? అన్న విషయం తేల్చబోతోంది.దీన్ని ఖరారు చేయడానికి ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా వేర్వేరుశాఖలకు చెందిన తొమ్మిది మంది ఉన్నతాధికారులను ఇందులో సభ్యులుగా చేర్చించింది. Also Read: నిమ్మగడ్డతో […]

Written By: Srinivas, Updated On : February 12, 2021 11:41 am
Follow us on


రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ.. 400 రోజులకు పైగా సాగుతున్న ఉద్యమంపై జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రాంత పరిధిలోని స్తంభించిపోయిన ప్రాజెక్టులు, భవనాల నిర్మాణాలపై భవిష్యత్ ను నిర్ధారించబోతోంది. మూడు రాజధానుల నేపథ్యంలో అమరావతిలో భవనాలు నిర్మించాలా..? లేదా..? అన్న విషయం తేల్చబోతోంది.దీన్ని ఖరారు చేయడానికి ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా వేర్వేరుశాఖలకు చెందిన తొమ్మిది మంది ఉన్నతాధికారులను ఇందులో సభ్యులుగా చేర్చించింది.

Also Read: నిమ్మగడ్డతో జగన్ సర్కార్ రాజీ?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ చైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో భూ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి సాధారణ పరిపాలనశాఖ, మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి, ఆర్థిక మంత్రిత్వశాఖల ముఖ్యకార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి, అమరావతి మెట్రో రీజియన్ అబివృద్ధి అథారిటీ కమిషనర్ సభ్యులుగా ఉన్నారు. ప్రణాళిక కమిటీ కార్యదర్శి కమిటీ సమన్వయకుడా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి సలహాదారులను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. వీరు అమరావతి పరిధిలోని భవనాల పరిశీలన, వాటి యథార్థ స్థితిగతులు, ఇతర వివరాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్నారు.

Also Read: విశాఖ ఉక్కు ఉద్యమం.. తిలాపాపం.. తలా పిడికెడు..

ఈ కమిటీలో మున్సిపాలిటీల వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీలక్ష్మీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఏఎంఆర్డీఏ సహా అమరావతి మెట్రో పాలిటన వ్యవహారాలు ఆమె పరిధిలోకి వస్తాయి. రాజధాని పరిధిలో భవనాల వినియోగం.. కరకట్ట రోడ్డు విస్తరణ.. తదితర అంశాలపై ఆమె ఇదివరకే సర్వే చేపట్టారు. రాజధానిలో నిలిచిపోయిన భవన సముదాలయను పరిశీలించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఏఎంఆర్డీఏ పరిధిలో కొత్తగా చేపట్టిన.. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులు.. భవన సముదాయాలు.. ఇతర అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులు తెలుసుకునేందుకు ఇటీవలే సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దీని కొనసాగింపుగా.. కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికపైనే స్తంభించిన ప్రాజెక్టులు.. భవన సముదాయాల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అమరావతిని శాసన రాజధానిగా బదలాయించిన కేంద్రం అనంతరం అక్కడ నెలకొనే డిమాండ్ జనాభా.. నివాసం ఏర్పరుచుకునే ఉద్యోగుల సంఖ్యను ఆధారంగా చేసుకుని తప్పనిసరిగా అవసరమైన భవన సముదాయాల నిర్మాణాలు మాత్రమే కొనసాగించేలా జగన్ సర్కారు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. శాసన రాజధానికి తప్పనిసరిగా అవసరమైన భవనాలు.. వసతులు సమకూర్చుకునేందుకు అవసరమైన నివేదిక కమిటీ ప్రభుత్వానికి అందించనుంది.