ఏపీలో జగన్: తిరుపతి’లో బీజేపీతో సాధ్యమేనా?

తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది అంటే అందుకు బలమైన కారణాలున్నాయి. అధికార పార్టీ తెరాస మీద మొదలైన వ్యతిరేకత, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి లీడర్లు పార్టీలో ఉండటం, తెలంగాణ ప్రజానీకం మార్పు కోరుకుంటుండటం అన్నిటినీ మించి అక్కడ బీజేపీకి ఒక స్పష్టమైన ఎజెండా, లక్ష్యం ఉన్నాయి. పైన చెప్పుకున్న వాటిలో ఏవి పనిచేసినా చేయకపోయినా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీకి ఉన్న లక్ష్యమే వారిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. Also Read: అంతా […]

Written By: NARESH, Updated On : December 6, 2020 2:49 pm
Follow us on

తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది అంటే అందుకు బలమైన కారణాలున్నాయి. అధికార పార్టీ తెరాస మీద మొదలైన వ్యతిరేకత, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి లీడర్లు పార్టీలో ఉండటం, తెలంగాణ ప్రజానీకం మార్పు కోరుకుంటుండటం అన్నిటినీ మించి అక్కడ బీజేపీకి ఒక స్పష్టమైన ఎజెండా, లక్ష్యం ఉన్నాయి. పైన చెప్పుకున్న వాటిలో ఏవి పనిచేసినా చేయకపోయినా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీకి ఉన్న లక్ష్యమే వారిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది.

Also Read: అంతా నేనే చేశానంటున్న బాబు

దుబ్బాక, గ్రేటర్ లో వచ్చిన ఫలితాలతో బీజేపీ నేతలు తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారట. తిరుపతిలో ఉపఎన్నికలు జరిగితే గెలుపు తమదేనంటూ బీజేపీ ప్రకటనలు చేస్తోంది.. రెండు తెలుగు రాష్ట్రాల కీలక నేతలందర్నీ అక్కడికే పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ నాయకుల్లో ఆ కమిట్మెంట్ ఉంది. ఈ రెండేళ్లలో వారు చేసిందంతా ముక్కుసూటి రాజకీయమే తప్ప డొంక తిరుగుడు వ్యవహారం ఎక్కడా లేదు. అదే అక్కడి జనానికి నచ్చింది. మరి ఏపీ బీజేపీలో ఈ లక్షణాలు ఉన్నాయా అంటే ముమ్మాటికీ లేవనే అనాలి.

2019 ఎన్నికల్లో తిరుపతి సీటు విషయంలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని చతికిలపడ్డ బీజేపీ.. ఏడాదిన్నరలోనే గెలిచేంత పుంజుకుంటుందా అనేది అనుమానించదగ్గ విషయం. టీడీపీ, బీజేపీ, జనసేన.. మూడూ కలసి పోటీ చేసిన 2014లోనే తిరుపతి లోక్ సభ సీటు వైసీపీ ఖాతాలో పడింది. ఇప్పుడిక విడివిడిగా వీళ్లు సాధించేదేంటన్నది సందేహం.

Also Read: జగన్‌కు మహిళలు జై… సైలెంట్‌గా రిపోర్టులు!

ఒకవేళ టీడీపీ లోపాయికారీగా బీజేపీ-జనసేన కూటమికి మద్దతు తెలిపినా కూడా అక్కడ వాళ్లకు ఒరిగేదేం లేదు. ఎందుకంటే.. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ లోకి వచ్చే అన్ని నియోజకవర్గాలు వైసీపీ చేతిలోనే ఉన్నాయి.

ఏడాదిన్నర జగన్ పాలన మీద ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత కనిపించట్లేదు. అయినా జగన్ ను ఢీకొట్టగలమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటిస్తున్నారు. అయితే తెలంగాణలో వచ్చిన విజయాలు సాధ్యమేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఎలా చూసుకున్నా తిరుపతి తిరిగి వైసీపీ ఖాతాలోనే పడుతుందనేది స్థానికుల అభిప్రాయం. దీనికితోడు జగన్ పాలన, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఉండనే ఉన్నాయి. కాబట్టి బీజేపీతో సాధ్యమవుతుందా లేదా చూడాలి. ఒకవేళ కొడితే మాత్రం అది సంచలనమే… దుబ్బాక, గ్రేటర్ టైపులో తిరుపతిలో వ్యూహాలు, తెరవెనక రాజకీయాలు పనిచేస్తావా? లేవా అన్నది చూడాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్