దేశంలో చాలామంది స్కిన్ ఇన్ఫెక్షన్లతో బాధ పడుతూ ఉంటారు. అయితే స్కిన్ ఇన్ఫెక్షన్లు రావడానికి ఒక్కొక్కరిలో ఒక్కో సమస్య కారణమవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు దుస్తులు, లో దుస్తులు శుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
శరీరం పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వర్షం కురిసే సమయంలో గొడుగు లేదా రెయిన్ కోట్ తప్పనిసరిగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరి దుస్తులను మరొకరు వినియోగించినా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే మసాలా ఫుడ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. వెల్లుల్లి, ఓట్స్, పండ్లు, కూరగాయలు, దంపుడు బియ్యం, బాదం, పెరుగు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.
శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఏవైనా చర్మ సమస్యలు ఉంటే వేడి నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. యాంటీ-ఫంగల్, యాంటీ-బాక్టీరియల్ క్రీములను వాడటం ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఏవైనా ఎలర్జీలు ఉంటే వైద్యులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.
హవాయి చెప్పులు, కాటన్ సాక్స్ వాడటం, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. మధుమేహంతో బాధ పడేవాళ్లు ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఏవైనా పుండ్లు శరీరంపై ఉంటే ఇన్ఫెక్షన్లు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. వర్షంలో తడిచిన జుట్టును వెంటనే తుడుచుకున్నా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.