మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నాడనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఈ మేరకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం సాగింది. అయితే సడెన్ గా గంటాకు నో ఎంట్రీ దక్కింది. ఎవరు వ్యతిరేకించారు.? గంటాను ఎందుకు చేర్చుకోలేదు.? తెరవెనుక ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది.
Also Read: గాసిప్: పవన్ కు నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తారా?
గంటా శ్రీనివాస్.. ఎప్పుడూ కూడా అధికారంలో ఉండే పార్టీలో చేరి మంత్రిగా ఐదేళ్లు అధికారం అనుభవించడం ఒక పాలసీగా పెట్టుకున్నాడనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలోచేరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కూడా గంటా శ్రీనివాసరావు మంత్రి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయాక టీడీపీలో చేరి గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా చేశారు.అంతకు ముందు కూడా అంతే..
అయితే తాజాగా గంటా శ్రీనివాస్ రావు వైసీపీలో చేరాలని డిసైడ్ అయ్యారట.. సీఎం జగన్ ను ఒప్పించి మెప్పించి దాదాపు ఖాయం చేసుకున్నారు. కానీ ఎందుకో కానీ సడెన్ గా ఆ ప్రక్రియ ఆగిపోయింది.
Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్ లోనూ.. యూకేకు భారత విమానాలు..!
నిజానికి వైసీపీలోకి గంటా చేరికపై మొదట వైసీపీ అధిష్టానం మీడియాలో లీకులు ఇచ్చింది. దానిపై స్పందన చూడగా.. వైసీపీ శ్రేణుల్లో ప్రజల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే గంటా చేరికను ఆయన ప్రత్యర్థి మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖ జిల్లా ఇన్ చార్జిగా బాధ్యతలు చూస్తున్న విజయ సాయిరెడ్డి కూడా గంటా చేరికకు నో చెప్పినట్టు తెలిసింది. దీంతో గంటా చేరికకు బ్రేక్ పడింది.
దీంతో తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బయటకు వచ్చారు. తాను పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారంపై గంటా శ్రీనివాసరావు తొలిసారి స్పందించారు. పార్టీ మారతానని ప్రతిసారి పబ్లిసిటీ ఇస్తున్నారని.. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే క్లారిటీ ఇస్తానన్నారు. ఒకవేళ తాను పార్టీలోకి వెళ్లాలనుకుంటే.. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అని గంటా వ్యాఖ్యానించారు. అటువంటి నిర్ణయాలు, మార్పులు జరిగితే అందరికీ చెప్పే చేస్తానన్నారు. తనపై జరిగే ప్రచారంపై ప్రతిసారి స్పందించలేను అని అన్నారు. దీంతో గంటా పార్టీ మార్పు లేదని స్పష్టమైంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్