దేశంలోనే తాను సీనియర్ లీడర్‌నంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమయం వచ్చినప్పుడల్లా అంటుంటారు. కానీ.. అధికారం పోయాక కూడా ఆయనలో మార్పు రావడం లేదని తమ్ముళ్లు మదనపడుతున్నారు. పార్టీ సీనియర్ నేతలే కాదు.. జూనియర్లు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన వారందరూ చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారట.
Also Read: గంటా శ్రీనివాస్ కు వైసీపీలో నో ఎంట్రీ వెనుక అతడేనా?
చంద్రబాబుకు ఎంత సీనియర్ అనే పేరు ఉందో.. అదే సమయంలో ఆయన మైకు పట్టుకుంటే వదలరు.. అనే పేరు కూడా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న సందర్బంగా వచ్చినా పార్టీ శ్రేణులతో కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ క్రమంలో ఆయన మైకు పట్టుకున్నారంటే మినిమం నాలుగు గంటలకు తక్కువగా మాట్లాడేవారు కాదు. చెప్పిందే చెప్పి.. కార్యకర్తలకు బోర్ తెప్పించే వారు. ఒక్క పార్టీ నేతల విషయమే కాదు.. ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో ఎప్పుడైనా సెమినార్లు పెట్టినా రోజుల తరబడి మైండ్ తినేవారనే కామెంట్లు వినిపించేవి.
అందుకే.. జగన్ అధికారంలోకి ఆ ఐఏఎస్ ఆఫీసర్లే చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు బేరీజు వేసుకుంటున్నారు. అంతేకాదు.. అప్పటికన్నా ఇప్పుడే బాగుందంటూ కీర్తిస్తున్నారు. జగన్ ఎంత పెద్ద నిర్ణయం అయినా ఫట్‌మని ఐదు నిమిషాల్లో తేల్చేస్తే దానికే చంద్రబాబు సమావేశం పెద్ద ప్రహసనం చేసేవారని కూడా సెటైర్లు వేసేస్తున్నారు. అధికారంలో ఉన్నారు కనుక ఇష్టమో.. కష్టమో.. భరించేవారు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక మాట్లాడేందుకు ముఖ్యంగా గంటల తరబడి మాట్లాడేందుకు సబ్జెక్టు ఏమీ లేదని అందరూ అనుకున్నారు. కానీ.. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అన్నట్లే చంద్రబాబు వేచిచూస్తున్నారు.
Also Read: గాసిప్: పవన్ కు నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తారా?
ఇన్నాళ్లు ఫేస్ టు ఫేస్ మీటింగ్‌లోనే నాలుగు గంటలకు పైగా ఉపన్యాసం చేసే చంద్రబాబు.. ఇప్పుడు జూమ్ మీటింగ్స్‌లో తన పైత్యం చూపుతున్నారు. నియోజకవర్గాలు, జిల్లాలు, నగరాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా పార్టీ నేతలతో జూమ్ మీటింగులు పెడుతున్నారు. పార్టీ పరిస్థితిపై గంటల కొద్దీ లెక్చర్లు దంచేస్తున్నారట. పోనీ.. ఈ సమయంలో పార్టీ పుంజుకునేందుకు నేతలు ఎవరైనా సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే.. ‘అంతా నాకు తెలుసు. ముందు నేను చెప్పింది విను!’ అని చురకలంటిస్తున్నారట. దీంతో పార్టీ నేతలు తల పట్టుకుంటున్నారు. పార్టీ ఎదుగుదలకు సూచనలు చేస్తే పట్టించుకోరు. మా బాధలు చెబుదామంటే .. టైం ఇవ్వరు.. చెప్పిందే చెప్పి.. మా మైండ్ అంతా తినేస్తున్నారు! అంటూ.. తమ్ముళ్లు తల బాదుకుంటున్నారట.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్