https://oktelugu.com/

ఇక బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్మాయం కాదా?

గాంధీలు పుట్టిన, నడియాడిన పార్టీ అది. దాదాపు 100 ఏళ్లకు పైగానే చరిత్ర దాని సొంతం. ఒకప్పుడు దేశంలో అసలు ప్రత్యామ్మాయం కూడా లేకుండా ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన పార్టీ. ఒక్క ఎంపీ సీటుకే పరిమితమై కాంగ్రెస్ ను ఎదుర్కోలేక ఆపసోపాలు పడ్డ భారతీయ జనతా పార్టీ దెబ్బకు ఇప్పుడు కాంగ్రెస్ కుదేలవుతోంది. నమ్మకం సడలిపోతోంది. Also Read: రజినీకాంత్ వస్తారా? హీటెక్కిన తమిళ పాలిటిక్స్ ఒక్కో రాష్ట్రం కాంగ్రెస్ నుంచి చేజారి బీజేపీ వశం అవుతుంటే చేష్టలుడిగి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 5:39 pm
    Follow us on

    BJP

    గాంధీలు పుట్టిన, నడియాడిన పార్టీ అది. దాదాపు 100 ఏళ్లకు పైగానే చరిత్ర దాని సొంతం. ఒకప్పుడు దేశంలో అసలు ప్రత్యామ్మాయం కూడా లేకుండా ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన పార్టీ. ఒక్క ఎంపీ సీటుకే పరిమితమై కాంగ్రెస్ ను ఎదుర్కోలేక ఆపసోపాలు పడ్డ భారతీయ జనతా పార్టీ దెబ్బకు ఇప్పుడు కాంగ్రెస్ కుదేలవుతోంది. నమ్మకం సడలిపోతోంది.

    Also Read: రజినీకాంత్ వస్తారా? హీటెక్కిన తమిళ పాలిటిక్స్

    ఒక్కో రాష్ట్రం కాంగ్రెస్ నుంచి చేజారి బీజేపీ వశం అవుతుంటే చేష్టలుడిగి చూస్తున్న దైన్యం కాంగ్రెస్ వాదుల్లో ఉంది. బీహార్ ఎన్నికల వేళ మిత్రపక్షం ఆర్జేడీని నడిపించాల్సిన రాహుల్ గాంధీ అక్కతో కలిసి సిమ్లా పిక్నిక్ కు వెళ్లాడంటే కాంగ్రెస్ పార్టీని ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    కాంగ్రెస్ వాదుల్లో సీరియస్ నెస్ తగ్గింది. అటు జాతీయ నాయకుల్లో ఇటు రాష్ట్ర నాయకుల్లోనూ అదే ఒరవడి కొనసాగుతోంది. అందుకే కాంగ్రెస్ పరిస్థితిని చూసి.. స్వయంగా కపిల్ సిబల్ లాంటి న్యాయకోవిదుడు.. సీనియర్ కాంగ్రెస్ నేత వాపోతున్నాడు. దేశంలో ఇక కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం బీజేపీకి ప్రత్యామ్మాయం కాదని తేల్చేశారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Also Read: కోహ్లీనే కుక్క అంటావా?.. కాంగ్రెస్ నేతపై రెచ్చిపోయిన నెటిజన్లు..!

    బీహార్ లో ఆర్జేడీ ఓటమికి కారణమై ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఇక ఏమాత్రం ప్రత్యామ్మాయంగా భావించడం లేదని పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. సొంత పార్టీపైనే ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలను ప్రస్తావించారు. పార్టీలో ప్రక్షాళన జరగాలని కుండబద్దలు కొట్టారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయం

    బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందని.. ఆరేళ్లుగా ఆత్మ పరిశీలన చేసుకోలేని కాంగ్రెస్.. ఇక చేసుకుంటుందని ఎలా ఆశించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇంతటి దుస్థితిలో ఎప్పుడు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్ నేతలే పార్టీ దుస్థితికి కారణమని సిబల్సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ లో లేదని నిప్పులు చెరిగారు.