జీహెచ్ఎంసీ ఎన్నికల స్టేకు హైకోర్టు నిరాకరణ

  త్వరలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించడంతో ఎన్నికలు నిర్వహించడం ఖాయమేనని తెలిసింది. అయితే ఈ ఎన్నికలను ఆపాలంటూ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్ పిల్ దాఖలు చేశారు. అత్యవసర పిటిషన్ గా స్వీకరించి విచారణ చేయాలని శ్రవణ్ తరుపున న్యాయవాది కోర్టును కోరారు. రాజకీయంగా బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని, బీసీల రిజర్వేషన్లు, రాజకీయ బీసీ రిజర్వేషన్లు […]

Written By: Suresh, Updated On : November 16, 2020 4:20 pm
Follow us on

 

త్వరలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించడంతో ఎన్నికలు నిర్వహించడం ఖాయమేనని తెలిసింది. అయితే ఈ ఎన్నికలను ఆపాలంటూ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్ పిల్ దాఖలు చేశారు. అత్యవసర పిటిషన్ గా స్వీకరించి విచారణ చేయాలని శ్రవణ్ తరుపున న్యాయవాది కోర్టును కోరారు. రాజకీయంగా బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని, బీసీల రిజర్వేషన్లు, రాజకీయ బీసీ రిజర్వేషన్లు వేర్వేరని న్యాయవాది వాదించారు. దీనికి స్పందించిన కోర్టు ఎన్నికలను ఆపాలనే దురుద్దేశంతోనే పిల్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరించింది.