https://oktelugu.com/

నువ్వుల పేరుతో నిధులు స్వాహా.. అక్షరాల ఎంతంటే?

రైతు సంక్షేమం కోసం కేసీఆర్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను దేశానికి ఆదర్శమని కేసఆర్ చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కన్పిస్తున్నాయి. అకాల వర్షాలు.. సాగులో దిగుబడి రాక అప్పులు ఊబిలో కురుకపోతున్న రైతాంగానికి ధైర్యం చెప్పాల్సిన వ్యవసాయాధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతులకు అందాల్సిన విత్తనాలను పంపిణీ చేయకుండా సొమ్ము చేసుకుంటుండం శోచనీయంగా మారింది. Also Read: 2021 ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 17, 2020 / 12:34 PM IST
    Follow us on

    రైతు సంక్షేమం కోసం కేసీఆర్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను దేశానికి ఆదర్శమని కేసఆర్ చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కన్పిస్తున్నాయి.

    అకాల వర్షాలు.. సాగులో దిగుబడి రాక అప్పులు ఊబిలో కురుకపోతున్న రైతాంగానికి ధైర్యం చెప్పాల్సిన వ్యవసాయాధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతులకు అందాల్సిన విత్తనాలను పంపిణీ చేయకుండా సొమ్ము చేసుకుంటుండం శోచనీయంగా మారింది.

    Also Read: 2021 ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్నాయా..?

    జగిత్యాల జిల్లాలో 2019-2020 సంవత్సరానికి జాతీయ ఆహార భద్రత పథకం కింద 90క్వింటాళ్ల నువ్వుల విత్తనాలు మంజూరు అయ్యాయి. అయితే వీటిని రైతులకు అందించకుండా వ్యవసాయాధికారులే సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

    ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహారభద్రత పథకం కింద నూనె పంటలు.. పప్పు దినుసులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఆహార పంటలను ప్రోత్సహించే భాగంగా విత్తనాలతోపాటు ఫెస్టిసైడ్స్.. నీమ్ ఆయిల్ ఉచితంగా పంపిణీ చేస్తోంది.

    2019-20 సంవత్సరానికి సైతం జగిత్యాలలో నూనె గింజల సాగు కోసం కేంద్రం 90క్వింటాళ్ల నూల విత్తనాలతోపాటు పంట సాగు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అయితే ఇవేవీ రైతులకు అందకపోవడం శోచనీయాంగా మారింది.

    జగిత్యాల జిల్లాలోని 18 మండలాల్లో ఒక్కో మండలానికి ఐదు క్వింటాళ్ల విత్తనాలు కేటాయించారు. ఇందుకోసం 163మంది ధరఖాస్తు చేసుకోగా ఎవరికీ కూడా విత్తనాలు అందలేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

    Also Read: అదే జరిగితే జగన్‌ ప్రభుత్వం కూలడం ఖాయమా..?

    90 క్వింటాళ్ల నువ్వుల పంట కోసం ప్రభుత్వం రూ.36లక్షను కేటాయించింది. అయితే జిల్లాలో నువ్వుల సాగు చేసిన రైతుల వివరాలు లేకపోవడం అధికారుల పని తీరుకు నిదర్శనంగా కన్పిస్తోంది.

    నిజానికి వ్యవసాయాధికారులే గ్రామాల్లో పర్యటించి రైతులకు విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే అధికారులు విత్తనాలను పంపిణీ చేయకుండా 36లక్ష సొమ్మును కాజేశారని రైతులు ఆరోపిస్తున్నారు.

    ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టిసారిస్తే అసలు విషయాలు బయటికొచ్చే అవకాశాలున్నాయని పలువురు రైతులు కోరుతున్నారు. కంచె చేను మేసిన చందంగా వ్యవహరిస్తున్న వ్యవసాయాధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే..!

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్