https://oktelugu.com/

అమ్మాయి ప్రాణం తీసిన ఆన్ లైన్ అప్పు

ఆన్ లైన్ అప్పులు ఇప్పుడు ప్రజల పాలిట పెను శాపమవుతున్నాయి. ఇలా అడగ్గానే అలా ఇచ్చే ఈ అప్పు తీర్చడం గగనమవుతోంది. అధికవడ్డీతో సామాన్యుల నడ్డి విరిచేస్తోంది. ఆన్ లైన్లో భారీగా అప్పులు ఇస్తామంటూ వివిధ కంపెనీలు, యాప్స్ ప్రజలకు వల వేస్తున్నాయి. ఈజీగా మనీ దొరుకుతుందని ఆశపడితే అంతే సంగతులు.. భారీ వడ్డీలు.. చెల్లింపులు లేట్ చేస్తే డబుల్ త్రిబుల్ ఫైన్ వేస్తారు. మానసికంగా హింసిస్తారు. ఇలాంటివి చాలా మంది అనుభవించి ఉంటారు. తాజాగా సిద్ధిపేటకు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2020 3:37 pm
    Follow us on

    Telangana Women suicide

    ఆన్ లైన్ అప్పులు ఇప్పుడు ప్రజల పాలిట పెను శాపమవుతున్నాయి. ఇలా అడగ్గానే అలా ఇచ్చే ఈ అప్పు తీర్చడం గగనమవుతోంది. అధికవడ్డీతో సామాన్యుల నడ్డి విరిచేస్తోంది. ఆన్ లైన్లో భారీగా అప్పులు ఇస్తామంటూ వివిధ కంపెనీలు, యాప్స్ ప్రజలకు వల వేస్తున్నాయి. ఈజీగా మనీ దొరుకుతుందని ఆశపడితే అంతే సంగతులు.. భారీ వడ్డీలు.. చెల్లింపులు లేట్ చేస్తే డబుల్ త్రిబుల్ ఫైన్ వేస్తారు. మానసికంగా హింసిస్తారు. ఇలాంటివి చాలా మంది అనుభవించి ఉంటారు. తాజాగా సిద్ధిపేటకు చెందిన ఓ యువ ప్రభుత్వ అధికారిణి ఈ ఆన్ లైన్ అప్పుకు బలైపోయింది. అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంది.

    Also Read: 2021 ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్నాయా..?

    సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన కిర్ని భూపాణి కుమార్తె కుమార్తె మౌనిక (24) ఏఈవోగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు. వీరు కొన్నాళ్లుగా సిద్ధిపేటలో నివాసం ఉంటున్నారు. తండ్రి వ్యాపార ప్రయత్నాల్లో నష్టాలు రావడంతో కుటుంబ అవసరాల కోసం మౌనిక ‘స్నాప్ఇట్ లోన్’ అనే యాప్ నుంచి రెండు నెలల క్రితం రూ.3 లక్షల లోన్ తీసుకున్నారు. డెడ్ లైన్ లోగా తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో యాప్ నిర్వాహకులు లోన్ డిఫాల్టర్ అంటూ ఆమె ఫోన్ లోని కాంటాక్టు నంబర్లన్నింటికి వాట్సాప్ మెసేజ్ లు పంపారు.

    దీనికి తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈనెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున మృతిచెందింది. ఆమె సోదరుడు భరత్ కంప్లైంట్ మేరకు సదురు ఆన్ లైన్ సంస్థపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Also Read: అదే జరిగితే జగన్‌ ప్రభుత్వం కూలడం ఖాయమా..?

    ఒక ప్రభుత్వ అధికారి కావడం.. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉండడం.. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి కావడంతో ఈ అవమానభారాన్ని తట్టుకోలేకపోయింది. మౌనిక ఆఫీసులో తెలిసిన వాళ్లు, బంధువులకు ఆ మెసేజ్ చేరడంతో అవమానంతో ఈ పని చేసింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్