
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగకు వేళైంది. ఏప్రిల్ 9 నుంచి భారత్ లోనే ఐపీఎల్ జరుగనుందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఐపీఎల్ 2021 14వ సీజన్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ వెల్లడించింది. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్ కతా నగరాలను వేదికలుగా ఎంపిక చేశారు.
ఏప్రిల్ 9న చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇక ప్లే ఆఫ్స్ తోపాటు మే 30న ఫైనల్ మ్యాచ్ ను సైతం అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది.
అయితే మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేసినా కూడా ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్ కు స్థానం దక్కలేదు. దేశంలోని ఐదు ప్రధాన నగరాలకే ఆ అవకాశాన్ని ఇచ్చి హైదరాబాద్ కు బీసీసీఐ మొండిచేయి చూపడంపై హైదరాబాద్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ప్రతీ టీం నాలుగు వేదికల్లో మ్యాచ్ లు ఆడుతుంది. మొత్తం 56 లీగ్ మ్యాచ్ లు. ఈ సీజన్ లో అన్ని టీమ్స్ తటస్థ వేదికల్లోనే మ్యాచ్ లు ఆడుతాయి. ఏ టీం కూడా హోం గ్రౌండ్ లో మ్యాచ్ ఆడడం లేదు. మ్యాచ్ లు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి.


Schedule for the IPL 2021: pic.twitter.com/2MQM4x2uEd
— Johns. (@CricCrazyJohns) March 7, 2021