https://oktelugu.com/

తొలి టీకాకు బ్రాండ్ అంబాసిడర్ భారతీయ మహారాణులే..!

కరోనా వైరస్ పేరు చెబితే ప్రస్తుతం యావత్ ప్రపంచం బెంబెలేత్తిపోతుంది. దీంతో ఈ మహమ్మరికి వాక్సీన్ కనుగొనేందుకు సైంటిస్టుల రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇప్పటికే రష్యా నుంచి కరోనా వ్యాక్సిన్ వచ్చినా దీనిపై పెద్దగా నమ్మకం లేదు. దీంతో పలుదేశాలు మరిన్ని ట్రయల్స్ చేసి మెరుగైన వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారతదేశం ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ ఖర్కానాగా పేరుగాంచింది. దీంతో యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 01:04 PM IST

    mysoor maharani

    Follow us on

    కరోనా వైరస్ పేరు చెబితే ప్రస్తుతం యావత్ ప్రపంచం బెంబెలేత్తిపోతుంది. దీంతో ఈ మహమ్మరికి వాక్సీన్ కనుగొనేందుకు సైంటిస్టుల రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇప్పటికే రష్యా నుంచి కరోనా వ్యాక్సిన్ వచ్చినా దీనిపై పెద్దగా నమ్మకం లేదు. దీంతో పలుదేశాలు మరిన్ని ట్రయల్స్ చేసి మెరుగైన వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారతదేశం ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ ఖర్కానాగా పేరుగాంచింది. దీంతో యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.

    Also Read: బిడెన్‌ గెలిస్తే.. చైనా గెలిచినట్లేనట.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

    అయితే ప్రపంచంలోని తొలి వ్యాక్సిన్(టీకా)కు ప్రచారం కల్పించింది మన భారతీయు మహారాణులే అని చాలామందికి తెలియదు. 18వ శతాబ్ధంలో భయాంకరమైన మశూచి వ్యాధి  ప్రబలింది. ఈ వ్యాధితో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో అప్పటికే బ్రిటిష్ కంపెనీకి చెందిన కంపెనీలు స్థిరపడటంతో పాలనను చేపట్టాయి. ఆ సమయంలోనే బ్రిటిష్ చెందిన సైంటిస్టులు మశూచికి టీకాను కనుగొన్నారు. భారత్ లోనూ మశూచి ప్రబలడంతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారతీయులతోపాటు బ్రిటీష్ వారిని కాపాడేందుకు టీకాను బ్రిటన్ దేశం నుంచి ఓడరేవుల్లో ఎంతో కష్టపడి తీసుకొచ్చారు.

    Also Read: వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?

    బ్రిటిష్ వారు మశూచికీ టీకాను కొనుగొనప్పటికీ దానికి పెద్దఎత్తున ప్రచారం కల్పించింది మాత్రం భారతీయ మహారాణులే. మైసూరు చెందిన రాణులే ప్రపంచంలోని తొలి వ్యాక్సిన్ కు బ్రాడ్ అంబాసిడర్ గా నిలిచారు. 18వ శతాబ్దంలో మైసూరు యువరాజు కృష్ణరాజు వొడియార్-3తో దేవజమ్మణికి వివాహం జరిగింది. నాడు మైసూరు దేశంలోనే సుసంపన్న రాజ్యంగా ఉండేది. నాటి పరిస్థితుల్లో దేశంలోని హిందువులు టీకాను వేసేందుకు మొగ్గుచూపలేదు. దీినికి అనేక కారణాలున్నాయి. ఈ పరిస్థితుల్లో మైసూరు మహారాణి దేవజమ్మణి టీకాను వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పెయిటింగ్ ఇటీవల వెలుగుచూసింది.మశూచి టీకాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మైసూరు రాణులు అప్పట్లో ఎంతో చొరవ చూపారు. ఆ తర్వాత కాలంలో అనేక మంది టీకాలను వేసుకున్నారు. దీంతో ఆ తర్వాత కాలంలో మశూచి వ్యాధి పూర్తిగా నిర్మూలించబడింది. అయితే మైసూరు మహారాణులు టీకాలు వేసుకున్న పెయిటింగ్ అందరికీ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ముగ్గురు మహిళలు కన్పిస్తున్నారు. చిన్న మహారాణి దేవజమ్మణి పెయింటింగులో కుడివైపు కన్పిస్తోంది. ఆమె టీకా వేయించుకున్నందుకు గుర్తుగా ఆ చేతిని బయటికి పెట్టినట్లు చూపించారు.ఆ కాలంలో బ్రిటీష్ వారి పాలన సాగుతున్నప్పటికీ పెత్తనం మాత్రం మైసూరు రాణుల చేతుల్లో ఉండటం వల్లే ఆ పెయిటింగ్ సాధ్యమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏదిఏమైనా ప్రపంచంలోని తొలి వ్యాక్సిన్ కు మన భారతీయు మహారాణులే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం మనందరికీ గర్వకారణంగా నిలుస్తోంది. నాటి మైసూరు మహారాణుల కృషి ఫలితంగానే నేడు భారతదేశం వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా బాసిల్లుతోందని చారిత్రకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.