మరో సీనియర్ నటికి కరోనా !

‘నీది నాది ఒకే కథ’ అనే చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న దర్శకుడు ‘వేణు ఉడుగుల’ తన రెండో సినిమాగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహరోయిన్ లుగా పెట్టి ‘విరాట పర్వం’ అనే సినిమాని చేస్తున్నాడు. కాగా ఈ పీరియాడిక్ డ్రామాలో సీనియర్ హీరోయిన్స్ ప్రియమణి, బాలీవుడ్ హీరోయిన్ జరీనా వాహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే జరీనా వాహాబ్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె కరోనా ప్రభావ లక్షణాలతో శ్వాస […]

Written By: admin, Updated On : September 22, 2020 1:32 pm
Follow us on


‘నీది నాది ఒకే కథ’ అనే చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న దర్శకుడు ‘వేణు ఉడుగుల’ తన రెండో సినిమాగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహరోయిన్ లుగా పెట్టి ‘విరాట పర్వం’ అనే సినిమాని చేస్తున్నాడు. కాగా ఈ పీరియాడిక్ డ్రామాలో సీనియర్ హీరోయిన్స్ ప్రియమణి, బాలీవుడ్ హీరోయిన్ జరీనా వాహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే జరీనా వాహాబ్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె కరోనా ప్రభావ లక్షణాలతో శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది పడుతుంది. అలాగే కీళ్ల నొప్పులు, జ్వరం సహా ఇతర లక్షణాలతో ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గాయట.

Also Read: డ్రగ్స్ కేసు.. హీరోయిన్లకు 20ఏళ్ల జైలు శిక్ష పడనుందా?

కాగా హుటాహుటిన ఆమెకు చికిత్స కోసం హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఇక ఆమె భర్త ఆదిత్య పంచోలికి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చినా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇక ‘విరాట పర్వం`లో జరీనా వాహాబ్ కీలకపాత్ర అట. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా వస్తోన్న ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాగా జరీనా వాహాబ్ ఒక దొరసానిగా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని ధరిపల్లి అనే గ్రామంలో ఈ సినిమా షూటింగ్ లో జరీనా వాహాబ్ పాల్గొంది. వచ్చే నెలలో ఈ సినిమా రెండో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.

ఈ షెడ్యుల్ లో కూడా జరీనా వాహాబ్ పాల్గొనాల్సి ఉంది. ఇప్పుడు ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో సినిమా షూటింగ్ ను మేకర్స్ రద్దు చేసే ప్లాన్ లో ఉన్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. సాయి పల్లవి ఇక ఈ సినిమాలో జానపద గాయనిగా మరియు కొన్ని సన్నివేశాల్లో నక్సలైట్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో అప్పటి రాజకీయ అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించనున్నారు.

Also Read: మరణానికి ముందు సుశాంత్ సంకేతాలు?