https://oktelugu.com/

వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..?

ఈ మధ్య కాలంలో కొత్త ప్రైవసీ పాలసీ వల్ల వార్తల్లో నిలుస్తున్న వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ప్రైవసీ పాలసీ నిబంధనలను వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వాట్సాప్ హెడ్ ​​విల్ క్యాత్‌కార్ట్‌ కు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసింది. భారతదేశంలోని వినియోగదారుల యొక్క గోప్యత, డేటా భద్రతను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది. Also Read: బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. ఏమిటంటే..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 19, 2021 / 07:03 PM IST
    Follow us on

    ఈ మధ్య కాలంలో కొత్త ప్రైవసీ పాలసీ వల్ల వార్తల్లో నిలుస్తున్న వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ప్రైవసీ పాలసీ నిబంధనలను వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వాట్సాప్ హెడ్ ​​విల్ క్యాత్‌కార్ట్‌ కు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసింది. భారతదేశంలోని వినియోగదారుల యొక్క గోప్యత, డేటా భద్రతను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది.

    Also Read: బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. ఏమిటంటే..?

    కేంద్ర ఐటీ శాఖ నుంచి ఈ మేరకు వాట్సాప్ యాప్ కు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నెల 4వ తేదీన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఎవరైతే ఈ నిబంధనలకు అంగీకరించరో వారి వాట్సాప్ అకౌంట్ ను తొలగిస్తామని వాట్సాప్ ప్రకటించింది. మొదట ఫిబ్రవరి 8వ తేదీని డెడ్ లైన్ గా ప్రకటించిన వాట్సాప్ ఆ తరువాత వాట్సాప్ యూజర్లు ఇతర యాప్ లపై దృష్టి పెట్టడంతో గడువును మూడు నెలల వరకు పొడిగించింది.

    Also Read: షావోమీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిపబ్లిక్ డే భారీ డిస్కౌంట్ ఆఫర్లు..?

    అయితే కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ నిబంధనలను అంగీకరించని వారి ఖాతాలను తొలగిస్తామని చెప్పడంపై సీరియస్ అయింది. గతంలో సుప్రీం కోర్టు ఒక కేసులో ప్రజల ప్రైవ‌సీ, అంగీకార సూత్రాల‌కు వాల్యూ ఇవ్వాలని చెప్పిన తీర్పును దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. దాదాపు 40 కోట్ల మంది వినియోగదారులు మన దేశంలో వాట్సాప్, ఫేస్ బుక్ యాప్ లను వినియోగిస్తున్నారు.

    మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

    కేంద్ర ఐటీ శాఖ ఈ రెండింటి యూజర్ల డేటాను సేకరించడం ద్వారా ప్రజల ప్రైవసీకి భంగం కలిగించినట్లు అవుతుందని లేఖలో పేర్కొంది. ఇండియన్ యూజర్ల నుంచి యాప్ సేకరించే ఖచ్చితమైన డేటాకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాలని కేంద్ర ఐటీ శాఖ కోరింది.