వైఎస్ షర్మిల పర్సనల్ జీవితం తెలుసా?

వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ కూతురిగా.. ఏపీ సీఎం జగన్ చెల్లెలిగా ఇన్నాళ్లు తెలుసు.కానీ ఇప్పుడు పార్టీ పెడుతున్న చేసిన ప్రకటనతో ఆమెలోని నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి.ఇప్పటికే అన్న జగన్ జైలుకు వెళ్లినప్పుడు వైసీపీ పగ్గాలు చేపట్టి పాదయాత్రతో ప్రజలకు చేరువ అయ్యింది షర్మిల. ఆ తర్వాత జగన్ జైలు నుంచి వచ్చాక ఆమెకు పార్టీలో పదవుల్లో తగిన స్థానం ఇవ్వలేదు. దీంతో అన్నాచెల్లెలు మధ్య విభేదాలు పొడచూపాయన్న ప్రచారం సాగింది. తాజాగా సజ్జల సైతం పార్టీ పెట్టవద్దని […]

Written By: NARESH, Updated On : February 9, 2021 9:48 pm
Follow us on

వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ కూతురిగా.. ఏపీ సీఎం జగన్ చెల్లెలిగా ఇన్నాళ్లు తెలుసు.కానీ ఇప్పుడు పార్టీ పెడుతున్న చేసిన ప్రకటనతో ఆమెలోని నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి.ఇప్పటికే అన్న జగన్ జైలుకు వెళ్లినప్పుడు వైసీపీ పగ్గాలు చేపట్టి పాదయాత్రతో ప్రజలకు చేరువ అయ్యింది షర్మిల. ఆ తర్వాత జగన్ జైలు నుంచి వచ్చాక ఆమెకు పార్టీలో పదవుల్లో తగిన స్థానం ఇవ్వలేదు. దీంతో అన్నాచెల్లెలు మధ్య విభేదాలు పొడచూపాయన్న ప్రచారం సాగింది. తాజాగా సజ్జల సైతం పార్టీ పెట్టవద్దని జగన్ సూచించినా వినకుండా షర్మిల పెట్టారని అనడంతో విభేదాల సంగతి నిజమేనని తేలింది.

తాజాగా నల్లగొండ జిల్లా పార్టీ నేతలతో సమావేశంలో తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని.. పార్టీ పెట్టబోతున్నట్టు వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణలో ఆరెళ్ల పాలనలో రైతులకు విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం లేదని విమర్శించారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు ప్రకటించారు. చేవెళ్లలో ఆమె పార్టీని ప్రకటిస్తారని ఆ పార్టీ నేత రాఘవరెడ్డి ప్రకటించారు. అయితే ఆ తేదీ ఎప్పడనేది వెల్లడించలేదు.

షర్మిల పార్టీకి జగన్ పార్టీకి ఏమాత్రం సంబంధం ఉండదని ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అక్కడ పార్టీని ఇక్కడ నడపమని రాఘవరెడ్డి వ్యాఖ్యనించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రాలో ఆయన పని ఆయన చేసుకుంటున్నారని తెలంగాణలో తాను నిబద్ధతతో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు షర్మిల చెప్పారు.

ఇక షర్మిల వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమెకు భర్త బ్రదర్ అనిల్.. ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి ఉన్నారు. తన భార్య కొత్త పార్టీ పెడుతున్న వేళ బ్రదర్ అనిల్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కోసం ఆమె తరఫున క్యాంపెయినింగ్ ప్రమోషన్ బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ విధానం నినాదాన్ని జనంలోకి తీసుకుని వెళ్లడానికి కావాల్సిన అంశాలు.. క్యాంపెయినింగ్ కోసం పాటలు అన్నీ తానే తయారు చేయించనున్నట్లు తెలిపారు. వైఎస్ షర్మిలను జనంలోకి తీసుకుని వెళ్లే బాధ్యత మొత్తం తన భుజస్కందాలపై వేసుకున్నారు.

నిజానికి షర్మిల తన బంధువైన చంద్ర ప్రతాప రెడ్డిని తొలుత పెళ్లి చేసుకుంది. అతనితో కొంతకాలానికే విభేదాలు వచ్చాయి. యోగి చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన చంద్రప్రతాప్ రెడ్డి అనుకుకోండా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన మరణం పలు సందేహాలకు తావిచ్చిందని అంటారు. ఇక ఆతర్వాత అనిల్ కుమార్ ని పెళ్లాడింది. అయితే ఇద్దరికీ రెండో పెళ్లి కావడం విశేషం. షర్మిలకు క్రైస్తవం స్వీకరించిన అనిల్ ఆ తర్వాత బ్రదర్ అనిల్ అయ్యాడు.

ఇక షర్మిలకు ఓ కుమారుడు ఓ కూతురు ఉన్ానరు. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నారు. రాయలసీమ పౌరుషానికి ప్రతీక అయిన తన తాత రాజారెడ్డి పేరును కొడుక్కిపెట్టుకుంది షర్మిల. అయితే రాయలసీన ఫ్యాక్షన్ ప్రభావం అతడిపై పడకూడదన్న ఉద్దేశ్యంతో విదేశాల్లో చదివిస్తోంది.