ఇంగ్లండ్ పేస్ కు ఇండియా విలవిల.. 124కే చాపచుట్టేసింది.. దారుణ ఓటమి

టీట్వంటీలో ప్రపంచ నంబర్ 1 జట్టు ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టీట్వంటీలో ఇండియా తేలిపోయింది. టెస్ట్ సిరీస్ లో స్పిన్ ఉచ్చులో ఇంగ్లండ్ ను బిగించిన ఇండియా.. ఈ మ్యాచ్ లో మాత్రం ఆ ఊపును కొనసాగించలేక ఓడిపోయింది. అహ్మదాబాద్ లోని మొతేరా పిచ్ పై బ్యాటింగ్ చేయడం కష్టమైంది. బాల్ బ్యాట్ పైకి రావడమే గగనమైంది. దీంతో ఇండియాను ఇంగ్లండ్ బౌలర్లు పేస్ తో దెబ్బకొట్టారు. కెప్టెన్ కోహ్లీ సైతం డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ […]

Written By: NARESH, Updated On : March 12, 2021 10:28 pm
Follow us on

టీట్వంటీలో ప్రపంచ నంబర్ 1 జట్టు ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టీట్వంటీలో ఇండియా తేలిపోయింది. టెస్ట్ సిరీస్ లో స్పిన్ ఉచ్చులో ఇంగ్లండ్ ను బిగించిన ఇండియా.. ఈ మ్యాచ్ లో మాత్రం ఆ ఊపును కొనసాగించలేక ఓడిపోయింది.

అహ్మదాబాద్ లోని మొతేరా పిచ్ పై బ్యాటింగ్ చేయడం కష్టమైంది. బాల్ బ్యాట్ పైకి రావడమే గగనమైంది. దీంతో ఇండియాను ఇంగ్లండ్ బౌలర్లు పేస్ తో దెబ్బకొట్టారు. కెప్టెన్ కోహ్లీ సైతం డకౌట్ అయ్యాడు.

ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టీ20లో టీం ఇండియా 124కే చాప చుట్టేసింది. 20ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసింది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి కోహ్లీ సేన విలవిల్లాడింది.

టీమిండియా బ్యాట్స్ మెన్ లలో కేఎల్ రాహుల్, కోహ్లీ డకౌట్ అయిపోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం తేలిపోయాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ కు టీమిండియా రెస్ట్ ఇచ్చింది. దీంతో బ్యాటింగ్ భారాన్ని శ్రేయస్ అయ్యర్ మోసాడు. ఈ మ్యాచ్ లో 67 పరుగులతో రాణించాడు. అతడికి రిషబ్ పంత్ 21 సమకరించాడు. మిగతా అందరూ ఔట్ కావడంతో టీమిండియా 124 పరుగులకే పరిమితమైంది. హార్ధిక్ పాండ్యా 19 సైతం మెరుపులు మెరిపించలేకపోయాడు.

ఇంగ్లండ్ ఏకంగా ఐదుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ తో ఉచ్చు బిగించింది. అర్చర్ 3 వికెట్లు తీసి దెబ్బతీశాడు. మిగతా బౌలర్లు అందరూ భారత బ్యాట్స్ మెన్ ను పరుగులు చేయకుండా కట్టిపడేశారు.

ఇక అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్ ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడుతూ కేవలం 16 ఓవర్లలోనే 125 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.