https://oktelugu.com/

ప్రపంచ కుబేరులని మించిన మన గుజరాతీ ‘అదానీ’ సంపద

ఓవైపు కరోనా కల్లోలంతో ప్రజల ఆదాయం తగ్గి రూపాయి రూపాయికి కష్టమవుతున్న వేళ మన దేశంలోనే ప్రముఖ గుజరాతీ వ్యాపారవేత్త అదానీ సంపద మాత్రం ప్రపంచ కుబేరులను మించి పెరగడం సంచలనమైంది. తాజాగా ప్రపంచ కుబేరుల్లో నంబర్ 1 స్థానానికి పోటీపడుతున్న ఎలన్ మస్క్, అమెజాన్ జెఫ్ బెజోస్ కంటే కూడా మన అదానీ నంబర్ 1గా నిలవడం విశేషం. అదానీకి పోర్టులు, ఎయిర్ పోర్టులు, కోల్ మైన్స్, పవర్ ప్లాంట్లు వంటి వివిధ వ్యాపారాలున్నాయి. వీటి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2021 / 08:45 PM IST
    Follow us on

    ఓవైపు కరోనా కల్లోలంతో ప్రజల ఆదాయం తగ్గి రూపాయి రూపాయికి కష్టమవుతున్న వేళ మన దేశంలోనే ప్రముఖ గుజరాతీ వ్యాపారవేత్త అదానీ సంపద మాత్రం ప్రపంచ కుబేరులను మించి పెరగడం సంచలనమైంది. తాజాగా ప్రపంచ కుబేరుల్లో నంబర్ 1 స్థానానికి పోటీపడుతున్న ఎలన్ మస్క్, అమెజాన్ జెఫ్ బెజోస్ కంటే కూడా మన అదానీ నంబర్ 1గా నిలవడం విశేషం.

    అదానీకి పోర్టులు, ఎయిర్ పోర్టులు, కోల్ మైన్స్, పవర్ ప్లాంట్లు వంటి వివిధ వ్యాపారాలున్నాయి. వీటి విలువ ఏకంగా 50 శాతం నుంచి 500 శాతం వరకు పెరగడం విశేషం. ఊహించని విధంగా షేర్లు లాభపడడంతో ఏకంగా ప్రపంచ కుబేరులను మించి అదానీ సంపాదించేశారు.

    2021లో ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరులైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ లను మించి అదానీ ఆదాయాన్ని ఆర్జించారని తాజాగా బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ తెలిపింది. ఈ ఏడాదిలో అత్యంత ఆదాయాన్ని ఆర్జించిన ప్రపంచ కుబేరులందరినీ అదానీ వెనక్కి నెట్టడం విశేషం.

    బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. అదానీ కంపెనీ షేర్లు 50శాతం మేర పెరిగాయి. అదానీ గ్యాస్ 96శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ 90శాతం, అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ 79శాతం, అదానీ పవర్, స్పోర్ట్స్ 52శాతానికి పైగా పెరిగింది. అదానీ నికరఆస్తి 16.2 బిలియన్ డాలర్లుగా ఉండేది. కానీ 2021లో 50 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే కుబేరులైన బెజోస్, మస్క్ లను సంపాదనలో అదానీ అధిగమించేశాడు.