https://oktelugu.com/

విశాఖలో టాలీవుడ్ హీరోకు ‘ఉక్కు’ సెగ

విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. విశాఖలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి సహా పలువురు నటులు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికారు. అయితే మిగతా హీరోలు మాత్రం మౌనం పాటిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖపట్నంలో అడుగుపెట్టగా.. ఆయన ఉక్కు సెగ తగిలింది. విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద హీరో విష్ణును నిరసనకారులు అడ్డుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2021 / 08:43 AM IST
    Follow us on

    విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. విశాఖలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి సహా పలువురు నటులు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికారు. అయితే మిగతా హీరోలు మాత్రం మౌనం పాటిస్తున్నారు.

    తాజాగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖపట్నంలో అడుగుపెట్టగా.. ఆయన ఉక్కు సెగ తగిలింది. విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద హీరో విష్ణును నిరసనకారులు అడ్డుకున్నారు.

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి టాలీవుడ్ మద్దతు ఇవ్వాలని విష్ణుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, నిరసనకారులు వినతిపత్రం అందజేశారు.

    విశాఖకు ఏ సినీ ప్రముఖులు వచ్చినా ఇలాగే అడ్డుకొని తమ ఆవేదనను వారికి వివరించి మద్దతు కోరుతామని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు స్పష్టం చేశారు.

    ఈ సందర్భంగా హీరో విష్ణు నిరసనకారులకు మద్దతు పలికారు. సంస్థ నష్టాల్లో ఉందని ప్రైవటీకరణ చేయాలనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని విష్ణు తప్పుపట్టారు. ప్రైవేటు వ్యక్తులు లాభాల్లో నిర్వహిస్తామన్నప్పుడు అదే పని ప్రభుత్వానికి ఎందుకు చేతకావడం లేదని ప్రశ్నించారు. సినీ పెద్దల నిర్ణయం మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేపట్టే ఉద్యమానికి మద్దతు ఉంటుందని మంచు విష్ణు స్పష్టం చేశారు.