https://oktelugu.com/

ఆట మొదలైంది: ఇండియా 329 ఆలౌట్.. పంత్ హాఫ్ సెంచరీ. ఇంగ్లండ్ 23/3

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఆట మొదలైంది. బంతి గింగిరాలు తిరుగుతోంది. పిచ్ మీద బ్యాటింగ్ చేయడం కష్టమవుతోంది. రెండోరోజు ఇంగ్లండ్ ఆట ప్రారంభించిన అరగంటలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 329 పరుగులకే ఆలౌట్ అయ్యింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 58 పరుగులో నాటౌట్ గా ఓ ఎండ్ లో నిలబడ్డాడు. కానీ అవతలి ఎండ్ లో భారత టెయిలెండర్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 14, 2021 / 11:13 AM IST
    Follow us on

    ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఆట మొదలైంది. బంతి గింగిరాలు తిరుగుతోంది. పిచ్ మీద బ్యాటింగ్ చేయడం కష్టమవుతోంది. రెండోరోజు ఇంగ్లండ్ ఆట ప్రారంభించిన అరగంటలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

    భారత్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 329 పరుగులకే ఆలౌట్ అయ్యింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 58 పరుగులో నాటౌట్ గా ఓ ఎండ్ లో నిలబడ్డాడు. కానీ అవతలి ఎండ్ లో భారత టెయిలెండర్లు నిలబడకపోవడంతో టీమిండియా 329 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నిన్న 300/6 పరుగులతో నిలిచిన ఇండియా కేవలం కొద్ది సేపటికే ఆల్ ఔట్ అయ్యింది. కేవలం 7 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్, ఇషాంత్, కులదీప్, సిరాజ్ లు త్వరగా ఔట్అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లు మెయిన్ అలీ 4, స్టోన్ 3 వికెట్లతో రాణించారు. ఇక భారత బ్యాట్స్ మెన్ లో రోహిత్ 161, రహానే పరుగులతో రాణించారు.

    అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ తొలి ఓవర్ మూడో బంతికే వికెట్ తీశాడు. ఆ తర్వాత వరుసగా మరో రెండు వికెట్లను అశ్విన్, అక్షర్ పటేల్ తీయడంతో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

    రెండోరోజే చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా సహకరిస్తోంది. దీనిపై బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టమవుతోంది. ఈరోజు ఇంగ్లండ్ నిలబడడం కష్టమేనంటున్నారు.