https://oktelugu.com/

పశ్చిమ బెంగాల్ లో రాజకీయ అస్త్రంగా ‘జైశ్రీరాం’ ఎందుకు మారింది?

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అందుకు కారణం త్వరలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీ పాగా వేయడానికి ఎత్తులు, పైఎత్తులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అలజడి సృష్టించిన కమలం నాయకులు అధికారం దిశగా పావులు కదుపుతున్నారు. ఇక్కడ అధికారంలోకి రావడానికి హిందూ నినాదాన్ని వాడుకుంటున్నారా..? అంటే టీఎంపీసీ నేతలు అదేనని సమాధానమిస్తున్నారు. హిందూ నినాదాలతో మా ప్రజలను ఆకట్టుకోలేరని, మేం కూడా హిందువులమేనని ఆ కార్యకర్తలు తిప్పికొడుతున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 14, 2021 / 11:43 AM IST
    Follow us on

    పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అందుకు కారణం త్వరలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీ పాగా వేయడానికి ఎత్తులు, పైఎత్తులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అలజడి సృష్టించిన కమలం నాయకులు అధికారం దిశగా పావులు కదుపుతున్నారు. ఇక్కడ అధికారంలోకి రావడానికి హిందూ నినాదాన్ని వాడుకుంటున్నారా..? అంటే టీఎంపీసీ నేతలు అదేనని సమాధానమిస్తున్నారు. హిందూ నినాదాలతో మా ప్రజలను ఆకట్టుకోలేరని, మేం కూడా హిందువులమేనని ఆ కార్యకర్తలు తిప్పికొడుతున్నారు. అయితే ‘జై శ్రీరాం’ అంటే టీఎంసీకి ఎందుకు కోపం వస్తుంది..? అని బీజేపీ నాయకులు సీఎం మమతాను ప్రశ్నిస్తున్నారు. దానికి వారిచ్చిన సమాధానం ఏంటంటే..?

    ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ లో బీజేపీ నాయకులు ‘జై శ్రీరాం’ నినాదాలు చేస్తే.. తృణమూల్ కార్యకర్తలు ‘జై కృష్ణ ’..‘జై కాళీ’.. ‘జై దుర్గా’.. అంటున్నారు. మాకూ నినాదాలు తెలుసని, మేం కూడా హిందువులమేనని టీఎంసీ నాయకులు వాదిస్తున్నారు. అయితే ‘మీరు హిందువులే అయినప్పుడు ‘జై శ్రీరాం’ అంటే కోపం ఎందుకు వస్తుందని ఆ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అలాగే ‘మమతా జీ.. జై శ్రీరాం అనడమే నేరామా.. జై శ్రీరాం అని ఇండియాలో కాకుండా పాకిస్థాన్ లో అంటారా..? అని ప్రశ్నించారు.

    అయితే ఈ విషయంపై తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా మాట్లాడారు. ‘జై శ్రీరాం అనే నినాదంతో తమకేమీ ఇబ్బంది లేదు.. సామాన్య ప్రజలు జై శ్రీరాం అంటే మేం సపోర్టుగా ఉంటాం.. కానీ బీజేపీ నాయకులు ప్రత్యేకంగా సభల్లో నినాదం చేయడమెందుకు..? మేం హిందువులం అని పదే పదే చెప్పాలా..? ఆ విషయానికొస్తే మేం జై కాళీ..జే దుర్గా.. జై కృష్ణా అనే నినాదాలు చేసుకుంటాం..’అని సమాధానమిచ్చారు.

    సుభాష్ చంద్రబోస్ 125 జయంతి సందర్భంగా ఓ సభలో బీజేపీ, టీఎంసీలు కలిసి పాల్గొన్నాయి. ఇక్కడా బీజేపీ నాయకులు ‘జై హింద్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన రాష్ట్ర సీఎం ప్రసంగం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. అయితే ఈ విషయంలో మమతా అలా ఎందుకు చేశారు అని ప్రశ్నించగా ‘రాజ్యంగంలోని ‘లౌకిక’ అనే పదాన్ని తీసేసి ‘హిందూ’ అనే పదాన్ని చేర్చండి.. రాజ్యాంగాన్ని మార్చే శక్తి మీ దగ్గర ఉంది’ అని ఎంపీ మహువా తెలిపారు.

    పశ్చిమ బెంగాల్ లో ఇలాంటి రాజకీయాలు కొత్తేమీ కాదు. కానీ హిందు నినాదంతో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది. అయితే రాష్ట్రంలో 28 శాతం మంది ముస్లింలు ఉన్నారు. వారిని బుజ్జగించడం కోసమే జైశ్రీరాం అనే నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ సీఎం మమత తప్పు పడుతుందని బీజేపీ ఆరోపిస్తోంది. కానీ దీనిపై టీఎంసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం ముస్లింలకు ప్రత్యేకంగా ఒక్క పథకం ప్రవేశపెట్టలేదు. తాము అన్ని వర్గాల అండగా ఉంటాం..బీజేపీ తప్పుడు ఆరోపణలు చేసే ప్రతీదాన్ని మేం పట్టించుకోం.. అని అంటోంది.