https://oktelugu.com/

ఇంగ్లండ్ తో 5వ టీ20: టీమిండియాలో కీలక మార్పులివీ..

ఇంగ్లండ్ తో టీ20 సమరం క్లైమాక్స్ చేరింది. చెరో రెండు మ్యాచ్ లు గెలిచి కీలకమైన 5వ టీ20కి రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్ గెలిచిన వారికే టీ20 టైటిల్ దక్కుతుంది. దీంతో చావోరేవో తేల్చుకునేందుకు ప్రపంచంలోనే టాప్ 2 టీ20 జట్లు అయిన ఇండియా, ఇంగ్లండ్ రెడీ అవుతున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ జట్ల మధ్య ఫైనల్ జరుగబోతోంది. టీమిండియా-ఇంగ్లాండ్ టి -20 సిరీస్ 2-2తో సమానంగా ఉన్న వేళ ఈ మ్యాచ్ కీలకమైంది. ఈ రోజు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 20, 2021 5:22 pm
    Follow us on

    ఇంగ్లండ్ తో టీ20 సమరం క్లైమాక్స్ చేరింది. చెరో రెండు మ్యాచ్ లు గెలిచి కీలకమైన 5వ టీ20కి రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్ గెలిచిన వారికే టీ20 టైటిల్ దక్కుతుంది. దీంతో చావోరేవో తేల్చుకునేందుకు ప్రపంచంలోనే టాప్ 2 టీ20 జట్లు అయిన ఇండియా, ఇంగ్లండ్ రెడీ అవుతున్నాయి.

    ప్రపంచంలోని అత్యుత్తమ జట్ల మధ్య ఫైనల్ జరుగబోతోంది. టీమిండియా-ఇంగ్లాండ్ టి -20 సిరీస్ 2-2తో సమానంగా ఉన్న వేళ ఈ మ్యాచ్ కీలకమైంది. ఈ రోజు సిరీస్ ఫైనల్ కోసం ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నాము. కాబట్టి సాయంత్రం 7 గంటల నుంచి ఫైనల్ ఉర్రూతలూగించడం ఖాయంగా కనిపిస్తోంది.

    పిచ్ రిపోర్ట్ చూస్తే గత 4 మ్యాచులలో టాస్ కీలకంగా మారింది. టాస్ గెలిచిన వారు మ్యాచ్ గెలిచినట్టే. మొదట బౌలింగ్ చేసినవారే విజేతగా నిలుస్తున్నారు. మంచు ఒక ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత మ్యాచ్ లో మాత్రం టీమిండియా అతికష్టం మీద దీన్ని తిరగరాసింది. ఇది మంచి ఛేజింగ్ వికెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అహ్మదాబాద్ స్టేడియం అనూహ్య మలుపులు తిరుగుతోంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయడం పక్కా..

    * టీమిండియాలో కీలక మార్పులు ఇవీ..
    ఇండియా టీంలో యువ ఇషాన్ కిషన్ కోసం కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్ వరుస వైఫల్యాలకు చవిచూశాడు. కోహ్లీ మరియు బ్యాటింగ్ కోచ్ రాథోడ్ నాలుగు మ్యాచ్ లు ఆడించినా కూడా మెరుగుపడలేదు. ఇషాన్ కిషాన్ గజ్జల్లో గాయం నుంచి నుండి కోలుకుంటే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మతో బ్యాటింగ్ చేయడం ఖాయం. సుందర్ తన చివరి మ్యాచ్లో 50 పరుగులు చేసినప్పటికీ, జట్టు యాజమాన్యం అతనికి మరోసారి చాన్స్ ఇవ్వవచ్చు. తెవాటియాతో భర్తీ చేయవచ్చు.

    టీమిండియా జట్టు అంచనా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ / ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ (సి), రిషబ్ పంత్ (wk), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహర్.

    ఇంగ్లాండ్: భారత్‌తో పోల్చితే ప్రత్యామ్నాయ మ్యాచ్‌లలో ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం ఆడుతున్న జట్టు చాలా స్థిరపడినట్లు కనిపిస్తోంది. జట్టులో మెరుగైన బ్యాలెన్స్ కోసం సామ్ కుర్రాన్ ను తప్పించే అవకాశం ఉంది. ఎడమచేతి వాటం మిడిల్ ఆర్డర్ ఆల్ రౌండర్ కావాలనుకుంటనే ఇంగ్లాండ్ సామ్ బిల్లింగ్స్‌కు చోటు లభిస్తుంది. ఉప ఖండ పిచ్‌లలో బిల్లింగ్స్‌కు కొంత అనుభవం ఉంది. మరో ఎంపిక ఆల్ రౌండర్ మొయిన్ అలీ. సిరీస్ డిసైడర్ అయినందున ఇంగ్లాండ్ నుండి ఎటువంటి మార్పులు చేయదలుచుకోలేదు.

    ఇంగ్లండ్ జట్టు అంచనా : జాసన్ రాయ్, జోస్ బట్లర్ (wk), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, ఎయోన్ మోర్గాన్ (సి), సామ్ కుర్రాన్ / మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్.