https://oktelugu.com/

అయ్యో.. ప్లాప్ హీరోకి ఇరవై కోట్లు నష్టం !

తెలుగు సినీ ఇండస్ట్రీ అంటేనే.. అదొక వారుసుల సమ్మేళనం. అందుకే ఎక్కువుగా వారసులు మాత్రమే స్టార్లు అయ్యారు. అయితే స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన అందరూ స్టార్లు కాకపోయినా.. కుటుంబంలో కనీసం ఒకరైన స్టార్ గా నిలబడ్డాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని ఫ్యామిలీ నాగ్, చైతు, మెగా ఫ్యామిలీ నుండి పవన్, చరణ్, బన్నీ.. ఇలా ఫ్యామిలీలను బట్టి వారి పిల్లలు హీరోలుగా తమ హవాని కొనసాగిస్తున్నారు. అయితే, మంచు ఫ్యామిలీకి కూడా […]

Written By:
  • admin
  • , Updated On : March 20, 2021 / 05:02 PM IST
    Follow us on


    తెలుగు సినీ ఇండస్ట్రీ అంటేనే.. అదొక వారుసుల సమ్మేళనం. అందుకే ఎక్కువుగా వారసులు మాత్రమే స్టార్లు అయ్యారు. అయితే స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన అందరూ స్టార్లు కాకపోయినా.. కుటుంబంలో కనీసం ఒకరైన స్టార్ గా నిలబడ్డాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని ఫ్యామిలీ నాగ్, చైతు, మెగా ఫ్యామిలీ నుండి పవన్, చరణ్, బన్నీ.. ఇలా ఫ్యామిలీలను బట్టి వారి పిల్లలు హీరోలుగా తమ హవాని కొనసాగిస్తున్నారు. అయితే, మంచు ఫ్యామిలీకి కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం ఉంది.

    Also Read: పాపం మధ్యలో కాజల్ భర్తకే ఇబ్బంది !

    కానీ మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళల్లో ఒక్కరు కూడా స్టార్ అనిపించుకోలేకపోయారు. నిజానికి మంచు విష్ణు స్టార్ డమ్ కోసం చేయని ప్రయత్నం లేదు. అయినా విష్ణుకి అసలు అదృష్టం కలిసి రావడం లేదు. అయితే కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడని.. వైవిధ్యమైన సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేయగలడు అని విష్ణు మంచి పేరు తెచ్చుకున్నా, అతనికి ప్రేక్షకులు హిట్ మాత్రం ఇవ్వడం లేదు. అందుకే మంచు ఫ్యామిలీకి నిర్మాతలు కూడా దూరమైపోయారు.

    ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒకపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క నిర్మాతగానూ వరుసగా సినిమాలను చేసుకుంటూ తెగ కష్టపతున్నాడు విష్ణు. నిన్న రిలీజ్ అయినా విష్ణు కొత్త సినిమా మోసగాళ్లు కోసం ఏకంగా భారీగా ఖర్చు పెట్టాడు. అయినా జనం ఆ సినిమాని ఆదరించలేదు. దాంతో ఆ సినిమా వల్ల విష్ణుకి దాదాపు ఇరవై కోట్లు నష్టం అని తెలుస్తోంది. ఎలాగూ కాలేజీలు స్కూల్స్ బిజినెస్ ఉంది కాబట్టి, నష్టాన్ని విష్ణు కవర్ చేసుకున్నా.. తనకు హిట్ రాలేదు అనే బాధ మాత్రం విష్ణును తెగ ఇబ్బంది పెడుతుందట.

    Also Read: సల్మాన్ ప్రభావం.. ఎప్పుడూ అదే ఆలోచిస్తోందట !

    ఇక విష్ణు ఆశలన్నీ శ్రీను వైట్లతో చేస్తోన్న ‘ఢీ సీక్వెల్’ సినిమా మీదే ఉంటాయి. మరి ప్లాప్ లతో ఇమేజ్ పోయి ప్రస్తుతం కిందామీదా పడుతున్న శ్రీను వైట్ల, మంచు విష్ణుకి ఏ రేంజ్ హిట్ ఇవ్వగలడు అనేదే ఇక్కడ అనుమానం. దీనికితోడు బాక్సాపీస్ వద్ద విష్ణు సినిమాలకి పెద్దగా కలెక్షన్స్ కూడా రావడంలేదు అని నిన్నటి మోసగాళ్ళతో తేలిపోయింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్