విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎన్నడూ లేని ఆదాయం

విశాఖ ఉక్కు మంటలు ఇంకా ఆరనే లేదు. విశాఖ ఉద్యమ వేడి చల్లారనే లేదు. నష్టాలు సాకుగా చూపి విశాఖ స్టీల్ పరివ్రమను కేంద్రం తెగనమ్మడానికి రెడీ అయ్యింది. అయినా పట్టువదలని కార్మికులు ఇంటా బయటా పోరాడుతున్నారు. ఆశ్చర్యకరంగా సంస్థను లాభాల బాట పట్టిస్తున్నారు. ఓ వైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆధీనంలోకి చేరుతుందన్న తరుణంలో ఇలా అత్యధికంగా లాభాలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని విశాఖ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు మాత్రం విశాఖ ఉక్కు […]

Written By: NARESH, Updated On : April 2, 2021 10:26 am
Follow us on

విశాఖ ఉక్కు మంటలు ఇంకా ఆరనే లేదు. విశాఖ ఉద్యమ వేడి చల్లారనే లేదు. నష్టాలు సాకుగా చూపి విశాఖ స్టీల్ పరివ్రమను కేంద్రం తెగనమ్మడానికి రెడీ అయ్యింది. అయినా పట్టువదలని కార్మికులు ఇంటా బయటా పోరాడుతున్నారు. ఆశ్చర్యకరంగా సంస్థను లాభాల బాట పట్టిస్తున్నారు. ఓ వైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆధీనంలోకి చేరుతుందన్న తరుణంలో ఇలా అత్యధికంగా లాభాలు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీలోని విశాఖ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు మాత్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మితే ఊరుకునేది ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ మాత్రం ఉక్కు ఫ్యాక్టరీపై పూర్తిగా అధ్యయనం చేసి దానిని అమ్మాలా..? లేక లాభాలు బాటకు తెచ్చే ప్రయత్నం చేయాలా..? అనే నివేదిక కోరింది. ఆ ప్రయత్నాల్లో ఉండగానే విశాఖ కార్మికులు అద్భుతం చేశారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.18 వేల కోట్ల టర్నోవర్ సాధించిందని సీఎండీ పీకే రథ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ప్లాంట్ కు సంబంధించిన టర్నోవర్ లాభాలు గడించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నడూ లేనంతగా 13 శాతం వృద్ధి సాధించిందన్నారు. ముఖ్యంగా ఈ కరోనా సమయం తగ్గిన తరువాత నాలుగు నెలల్లో రూ.740 కోట్లు సాధించినట్లు పేర్కొన్నారు. ఇక మార్చిలో 7,11,000 టన్నుల ఉక్కును రూ.3,300 కోట్లకు విక్రమించామని ఆయన పేర్కొన్నారు.

దీంతో ఉద్యమకారులు ఇటు ఉద్యమిస్తూనే అటు ఉత్పత్తిని పెంచారని అర్థమవుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో ఫ్యాక్టరీకి చెందిన కార్మిక నాయకులు కసిగా పనిచేస్తున్నారు. అధికార, ప్రతిపక్షపార్టీలు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు కార్మికులను పనిచేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఆదాయాన్ని లాభాలను వెల్లడించి అధికారులు కేంద్రానికి కనువిప్పు కలిగించారు. ప్లాంట్ అమ్మకుండా లాభాల్లో ఉందని చూపించారు.