పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ పవర్ తో చేసిన చిత్రం ‘వకీల్ సాబ్’ ఆ ట్రైలర్ విడుదలై ఇటీవల రికార్డులు బద్దలు కొట్టింది. పవన్ డైలాగులు వింటే గూస్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి. అంతటి పదునైన డైలాగులు ఖచ్చితంగా ఎవరో మాటల మాంత్రికుడే రాసి ఉంటాడని అందరూ అనుమానపడుతున్నారు.
అయితే అసలు విషయానికి వస్తే పవన్ తో ‘వకీల్ సాబ్’ రిమేక్ ను చేయమని చెప్పిందే త్రివిక్రమ్ అట.. పింక్ సినిమాను చేయమని.. అందులోని మహిళలపై కోర్టులో పలికే డైలాగులను కూడా నాడు పవన్ స్క్రిప్ట్ సందర్భంగా పవన్ తో పంచుకున్నాడట..
అయితే త్రివిక్రమ్ ఈ సినిమా నుంచి తప్పుకొని వేణు శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ కోర్టు సీన్లలోని నాడు తివ్రికమ్ చెప్పిన డైలాగులనే పవన్ పలికాడట.. ఈ మేరకు డైరెక్టర్ తో చెప్పించి వాటినే పెట్టించాడట..
ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. వకీల్ సాబ్ సినిమాలోని కీలకమైన కోర్టు సీన్లలో మహిళల గురించి పవన్ చెప్పిన డైలాగ్స్ అన్నీ త్రివిక్రమ్ రాశాడని అందుకే అవి అంత బాగా వచ్చాయని అంటున్నారు. మరి ఇది నిజామా కాదా అన్నది పక్కనపెడితే పవన్ డైలాగ్స్ మాత్రం అణుబాంబులా పేలాయి. అవి త్రివిక్రమ్ రాసినవే అని చాలా మంది భావిస్తున్నారు.