‘సొంతం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ‘జెమిని’, బిల్లా సినిమాల్లో నాజుకుగా కనిపించిన హీరోయిన నమిత గురించి తెలియని వారుండరు. ఈమెపై తమిళనాట ఓ గుడి కూడా కట్టి ఆరాధించారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో చాలా అందంగా.. సన్నగా ఉన్న నమిత తర్వాత తీవ్రంగా బరువెక్కి హెవీవెయిట్ తో సినిమాలకు దూరమయ్యారు.
అయితే నమిత బాగా మద్యం తాగడం వల్లే అలా లావైపోయిందని అందరూ ఆడిపోసుకున్నారు. 97 కిలోలకు చేరువైన నమిత తాజాగా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె నటిస్తున్న తాజాగా సినిమాపై ఇన్ స్టాగ్రామ్ పై స్పందించారు.
తాను మద్యం తాగడం వల్ల బరువెక్కలేదని.. థైరాయిడ్, పీసీఓడీ సమస్యల వల్లనే లావుగా మారననే విషయం తనకు మాత్రమే తెలుసు అని హీరోయిన్ నమిత తెలిపారు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా తనను తీవ్రంగా బాధించాయన్నారు. దాదాపు ఐదేళ్ల పాటు మానసికంగా నరకాన్ని అనుభవించానని.. యోగాతో మనశ్శాంతి లభించిందని నమిత తెలిపారు. పెళ్లి తర్వాత తాను పూర్తి సంతోషంగా ఉన్నట్టు ఆమె తెలిపారు.