https://oktelugu.com/

‘జాతిరత్నాలు’ ఫస్ట్ డే కలెక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే..?

‘ ‘జాతిరత్నాలు’.. నిన్న రిలీజ్ అయిన ఈ కామెడీ మూవీ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతోంది. హీరో నవీన్, కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు చేసిన కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదలయిన ఈ మూవీలో ముగ్గురు కలిసి చేసిన అల్లరి థియేటర్లో నవ్వులు పూయిస్తోంది. ‘మహానటి’ సినిమా ద్వారా సినీ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ నిర్మాతగా, కేవీ అనుదీప్ డైరెక్టర్ గా తీసిన ఈ సినిమా ఆల్ టైం రికార్డు వసూళ్లను […]

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2021 / 11:40 AM IST
    Follow us on

    ‘జాతిరత్నాలు’.. నిన్న రిలీజ్ అయిన ఈ కామెడీ మూవీ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతోంది. హీరో నవీన్, కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు చేసిన కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

    మహాశివరాత్రి సందర్భంగా విడుదలయిన ఈ మూవీలో ముగ్గురు కలిసి చేసిన అల్లరి థియేటర్లో నవ్వులు పూయిస్తోంది. ‘మహానటి’ సినిమా ద్వారా సినీ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ నిర్మాతగా, కేవీ అనుదీప్ డైరెక్టర్ గా తీసిన ఈ సినిమా ఆల్ టైం రికార్డు వసూళ్లను రాబడుతోంది.

    అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుండడంతో థియేటర్లన్నీ హౌజ్ ఫుల్ అవుతున్నారు. అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ఏజెంట్ శ్రీనివాస్, ఆత్రేయ సినిమాలతో ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టి.. ఇప్పటికే సూపర్ కమెడియన్లు అనిపించుకున్న ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు కలిసి ‘జాతి రత్నాలు’ సినిమాలో ప్రధాన రోల్ చేశారు.

    కథ సీరియస్ దే అయినా అందులోనూ తమదైన కామెడీని పండించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. చాలా రోజుల తరువాత వెండితెరపై కామెడీ సినిమా ఇంతలా నవ్వించడం చూసి సినీ అభిమానులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సెలవుదినం కావడంతో ఈ సినిమాకు కలిసొచ్చింది.

    జాతిరత్నాలు మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దాదాపు 700పైగా థియేటర్లలో ఇది రిలీజ్ అయ్యింది. అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ప్రిమీయర్ నుంచే దీనికి మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తున్నారు. నిన్న మరో మూడు సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ ‘జాతిరత్నాలు’ చిత్రానిదే హవా కనిపిస్తోంది.

    * జాతిరత్నాలు మొదటి రోజులు కలెక్షన్లు:
    -నైజాంలో రూ.142 కోట్లు
    -సీడెడ్ లో రూ.57 లక్షలు, -ఉత్తరాంధ్రలో రూ.45 లక్షలు,
    -తూర్పు గోదావరిలో రూ.38 లక్షలు,
    -పశ్చిమ గోదావరిలో రూ.28.30 లక్షలు
    -గుంటూరులో రూ.39 లక్షలు,
    -కృష్ణాలో రూ.28.40 లక్షలు
    -నెల్లూరులో రూ.20లక్షలు

    మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.3.94 కోట్ల షేర్.. రూ.6.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

    *ప్రపంచవ్యాప్తంగా జాతిరత్నాలు కలెక్షన్లు చూస్తే..
    తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో రూ.3.94 కోట్లు షేర్ చేసిన ఈ మూవీ.. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.8లక్షలు, ఓవర్సీస్ లో రూ.8లక్షలు రాబట్టింది. మొదటిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.4.84 కోట్లు షేర్ తోపాటు.. రూ.8.40 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జాతిరత్నాలు సినిమా రూ.10.80కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకోగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11.50 కోట్లుగా నమోదైంది. ఇక మొదటిరోజే రూ.4.84 కోట్లు వసూలు చేయడంతో టార్గెట్ చేరుకోవాలంటే రూ.6.66 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ ఊపులో ఆదివారం కల్లా సినిమా లాభాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. చిన్న సినిమాగా వచ్చి ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడంతో అంతా షాకైపోతున్నారు.