అమెరికాను అనేకమంది అధ్యక్షులు పరిపాలించారు. వారిలో కొంతమంది దేశ ప్రతిష్టను పెంశారు. మరికొందరు శక్తివంతంగా తీర్చిదిద్దారు. కొందరు బలహీన పరిచారు. ఇంకొందరు శాంతి కాముకులుగా గుర్తింపు పొందారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిల్లో ఏ ఒక్క కోవలోకి రారు. అమెరికా చరిత్రలో అత్యంత అప్రతిష్టను మూటగట్టుకున్న అధినేతగా మిగిలిపోతారు. 45వ అధ్యక్షుడిగా 2017 జనవరి నుంచి 2020 జనవరి వరకు నాలుగేళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. తాజాగా ఫిబ్రవరి 14న డొనాల్డ్ ట్రంప్ అభిశంసన గండం నుంచి కూడా గట్టెక్కినప్పటికీ.. అమెరికా చరిత్రలో ఆయన ప్రస్థానం ఒక చీకటి అధ్యాయాన్ని తలపిస్తోంది.
Also Read: అసోంలో అడ్డం తిరుగుతున్న బీజేపీ కథ..
ఇప్పటి వరకు ముగ్గురు అధ్యక్షులు అభిశంసన గండాన్ని ఎదుర్కొన్నారు. అయితే వీరెవరూ శిక్షకు గురికాకపోవడం ఒకింత ఉపశమనం కలిగించే విషయం. 1868లో నాటి అధ్యక్షుడు అభిశంసన గండాన్ని ఎదుర్కొన్నారు. తరువాత 1998లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన బిల్ క్లింటన్ ఈ పరిస్థితికి గురయ్యారు. మోనికా లెవిన్సీతో అక్రమ సంబంధాల విషయలో ఆయన అమెరికా కాంగ్రెస్ ముందు నిలబడాల్సి వచ్చింది. తరువాత ఈ దుస్థితికి గురైన మూడో అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఈ ముగ్గురు అధినేతలు నిర్ధోషులుగా బయటపడడం విశేషం. అభిశంసనను ఎదుర్కొన్న ఈ ముగ్గురు అధ్యక్షులు అనంతరం ఎన్నికల్లో ఓడిపోవడం విశేషం.
అభిశంసనకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ది ప్రత్యేక పరిస్థితి. ఆయన రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్నారు. గతంలో ఏ అధ్యక్షుడికీ ఇలాంటి దుర్భర పరిస్థితి ఎదురుకాకపోవడం గమనార్హం.తొలిసారి 2019 డిసెంబరులో ఆయనపై అభిశంసనను నాటి విపక్ష డెమొక్రటిక్ సభ్యులు ప్రతిపాదించారు. అయితే సెనెట్లో తగినంత మెజారిటీ లేకపోవడంతో అది వీగిపోయింది. తాజాగా రెండోసారి కూడా ట్రంప్ అభిశంసనకు డెమొక్రటిక్ పార్టీ గట్టిగా ప్రతిపాదించింది. ఈ సారి తగినంత మెజారిటీ లేక భంగపడింది.
Also Read: వైరల్: ఆస్పత్రి బెడ్ పై నుంచి మమతా బెనర్జీ వీడియో సందేశం
సాధారణంగా అభిశంసన తీర్మానం నెగ్గాలంటే.. నెసెట్లో మూడింట రెండు వంతులు మెజారిటీ అవసరం. సెనెట్లో మొత్తం వందమంది సభ్యులకు గాను తీర్మానం నెగ్గాలంటే.. 67మంది మద్దతు అవసరం. కానీ 57 మందే మద్దతు పలికారు. 47మంది అభిశంసన తీర్మానాన్ని అడ్డుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన ఏడుగురు రిపబ్లికన్ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. మొత్తానికి 57 .. 43 ఓటింగుతో తీర్మానం వీగిపోవడంతో బతుకు జీవుడా అంటూ ట్రంప్ బయటపడ్డారు. సభ్యుల మద్దతు లేక సాంకేతికంగా అభిశంసన వీగిపోయినప్పటికీ.. అమెరికా ప్రజలు ఎప్పుడో అభిశంసించారన్నది వాస్తవం.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్