spot_img
Homeఅత్యంత ప్రజాదరణహైదరాబాద్.. భాగ్యనగరం.. ఇందులో ఏదీ అసలు పేరు..?  

హైదరాబాద్.. భాగ్యనగరం.. ఇందులో ఏదీ అసలు పేరు..?  

Hyderabad

హైదారాబాద్.. ప్రపంచంలో చాలా మందికి ఈ పేరు తెలుసు.. ఎందుకంటే ఒకప్పుడు ప్రత్యేక సంస్థానంగా ఉన్న హైదరాబాద్ స్వాతంత్ర్యం  తరువాత భారత్ లో కలిసిపోయింది. అయితే హైదరాబాద్ చరిత్ర అప్పడిదే కాదు.. అంతకుముందు అంటే దాదాపు 500 ఏళ్ల చరిత్రను కలిగి ఉందీ నగరం. ఎన్నో సంవత్సరాల నుంచి సుల్తానులు ఏలిన ఈ రాజ్యం 1500 సంవత్సరం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి వరకు గోల్కొండగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం కుతుబ్ షాహీ రాజు హైదరాబాద్ ను నిర్మించడంతో నగర చరిత్ర ప్రారంభమైనట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది.

Also Read: కేసీఆర్‌‌ నోట.. మళ్లీ ఢిల్లీ మాట

తాజాగా హైదరాబాద్ చరిత్రపై జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ పేరు మారుస్తామని వ్యాఖ్యానించాడు. ఆ పేరును మార్చి భాగ్యనగరం గా పెడుతామని అంటున్నాడు. దీంతో సంజయ్ ఆ విధంగా వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి..? అసలు హైదరాబాద్ కు పేరు మార్చాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న అందరిలో మొదలైంది. అంతేకాకుండా హైదరాబాద్ చరిత్రపై కొందరు నెట్టింట్లో, పుస్తకాల్లో సెర్చ్ చేస్తున్నారు.

*కులీకుతుబ్ షా లవ్ స్టోరీ..

హైదరాబాద్ కు భాగ్యనగరం అనే పేరుండేదని కొందరు చరిత్రకారులు తమ పుస్తకాల్లో ఇలా రాశారు. ‘1565-1611 మధ్య జీవించిన మహ్మద్ కులీ అనే 5వ కుతుబ్ షాహీ రాజు, భాగమతి అనే హిందూ అమ్మాయిని ప్రేమించాడు. ప్రస్తుతం చార్మినార్ ఉనన ప్రాంతంలో చించలం అనే గ్రామంలో ఆ అమ్మాయి ఉండేది. ఆమెను చూడడానికి కుతుబ్ షాహీ రాజు రోజు గోల్కొండ నుంచి నదిని దాటి చించల గ్రామానికి వెళ్లేవాడు. ( కొన్నేళ్ల తరువాత చించల గ్రామం చుట్టూ నగరాన్ని నిర్మించారు.. అప్పటి కొత్త నగరం.. ఇప్పటి పాత బస్తీ) అయితే కుతుబ్ షాహీ బాధను చూడలేక ఆయన తండ్రి ఇబ్రహీం 1578లో వంతెనను కట్టాడు. ఆ తరువాత 1580లో కులీ, భాగమతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఆమె పేరును హైదర్ మహల్ గా మార్చారు.’ అయితే ఇది నిజం కాదని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే కులీ వంతెనను కట్టింది 13 ఏళ్లలో.. ఆ వయసులో ఆయన ఏ అమ్మాయిని ప్రేమించలేదని అంటున్నారు. మరోవైపు గొల్కొండ ప్రాంతాన్ని, ఇబ్రహిం పట్నంను కలపడానికి వంతెనను నిర్మించారని అంటున్నారు.

*1596 సంవత్సరంలో ఫర్కుందా బన్యాడ్..

అయితే కులీకుతుబ్ షా అధికారంలోకి వచ్చాక 1591లో కొత్తగా నగరం నిర్మాణ పనులు మొదలు పెట్టాడు. 1596 సంవత్సరంలో ఫర్కుందా బన్యాడ్ (పర్షియన్ పదమైన ఫర్కుందా బన్యాడ్ ను సంస్క్రుతంలోకి అనువదిస్తే భాషలో అద్రుష్ట నగరం లేదా భాగ్యనగరం అని వస్తుంది) అని పేరు పెట్టాడట.

Also Read: వాహనదారులకు అలర్ట్.. అలాంటి హెల్మెట్లే వాడాలంటున్న కేంద్రం..?

*ఎక్కువగా తోటలు ఉన్నాయని..

బాగ్ అంటే ఉర్దూలో తోట అని అర్థం. అప్పడు ఇక్కడ ఎక్కువగా తోటలు ఉండేవి కాబట్టి ‘బాగ్ నగర్’అని పిలిచే వారని అయితే ఎన్నడూ అధికారికంగా ప్రకటించలేదని హరూన్ ఖాన్ షేర్వాణి అనే చరిత్రకారుడు 1967లో దీన్ని ప్రతిపాదించాడు. ఈ విషయం ఫ్రెంచ్ యాత్రికుడు బాప్టిస్టు టావెర్నియర్ తాను రాసిన పుస్తకంలో చెప్పాడు. కానీ షేర్వాణి వాదనను ఖండిస్తూ నరేంద్ర లూథర్ ఓప్రతిపాదనను తెచ్చారు. 1992-93 లో ‘అన్ ది హిస్టరీ ఆఫ్ భాగమతి’ పేరుతో ఈ వ్యాసాన్ని నరేంద్ర లూథర్ ప్రతిపాదించారు. ఇందులో భాగమతి పేరుతోనే నగరానికి భాగ్యనగరం అనే పేరు వచ్చిందని పేర్కొన్నాడు. 1996లో సాలార్జాంగ్ మ్యూజియం ప్రచురించిన ద్వివార్షిక పరిశోధన పత్రాల్లో ఈ వ్యాసం ఉంది.

*సుల్తాన్ కు భాగమతి అంటే ఇష్టమట..

మహ్మద్ కాసి ఫెరిస్తా అనే చరిత్రకారుడు రాసిన హిస్టరీ ఆఫ్ ద రైస్ ఆఫ్ మహమ్మదియన్ పవర్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో మరో కథ రాశాడు. ‘సుల్తాన్ కు భాగమతి అనే వేశ్య అంటే చాలా ఇష్టం అతను కొత్తగా నిర్మించిన నగరానికి భాగ్ నగర్ అని పేరు పెట్టి, తరువాత బాధపడి, దాన్ని హైదరాబాద్ అని మార్చాడు’ అని తన పుస్తకంలో ప్రచురించాడు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

*నాణెల్లో స్పష్టంగా హైదరాబాద్..

ఇలా ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ కు ఆ పేరు ఎలా వచ్చిందన్న విషయం ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. అయితే 1603లో విడుదలైన నాణెల్లో హైదరాబాద్ అని స్ఫష్టంగా ఉంది. అంటే అప్పటి వరకు భాగ్యనగరం నుంచి హైదరాబాద్ గా పేరు మారిందని తెలుస్తోంది. దీంతో భాగ్య నగరం అనే పేరు ఎక్కువ రోజులు చెలమణిగా లేదని అర్థమవుతోంది. అంటే గొల్కొండగా ప్రారంభమైన ఈ నగరం ఆ తరువాత భాగ్యనగరంగా అనంతరం హైదరాబాద్ గా పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version