గూగుల్ లో వీటిని సెర్చ్ చేస్తున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే..?

మనలో చాలామంది ఎటువంటి సమాచారం కావాలన్నా గూగుల్ పై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ ద్వారా క్షణాల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే కొన్ని విషయాలను మాత్రం గూగుల్ లో అస్సలు సెర్చ్ చేయకూడదు. ఒకవేళ సెర్చ్ చేస్తే మాత్రం మనకు మనమే సమస్యలను సృష్టించుకున్నట్లు అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. గూగుల్ లో చాలా మంది కస్టమర్ కేర్ నంబర్ల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సరైన కస్టమర్ […]

Written By: Navya, Updated On : November 29, 2020 8:39 am
Follow us on


మనలో చాలామంది ఎటువంటి సమాచారం కావాలన్నా గూగుల్ పై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ ద్వారా క్షణాల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే కొన్ని విషయాలను మాత్రం గూగుల్ లో అస్సలు సెర్చ్ చేయకూడదు. ఒకవేళ సెర్చ్ చేస్తే మాత్రం మనకు మనమే సమస్యలను సృష్టించుకున్నట్లు అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

గూగుల్ లో చాలా మంది కస్టమర్ కేర్ నంబర్ల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సరైన కస్టమర్ కేర్ నంబర్ దొరకకపోవడం వల్ల మనం కస్టమర్ కేర్ నంబర్ అనుకుని సైబర్ మోసగాళ్లకు ఫోన్ చేసి మోసపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల గూగుల్ లో కస్టమర్ కేర్ నంబర్లను ఎట్టి పరిస్థితుల్లో వెతకకూడదు. కస్టమర్ కేర్ నంబర్ల గురించి కంపెనీ వెబ్ సైట్లలో సమాచారం కోసం వెతికితే మంచిది.

గూగుల్ లో ఆన్ లైన్ బ్యాంకింగ్ వెబ్ సైట్లకు సంబంధించిన సంబంధించిన సమాచారం వెతకకూడదు. బ్యాంకుల ఒరిజినల్ పేజీలను పోలిన ఫిషింగ్ వెబ్ సైట్లు ఆన్ లైన్ లో ఉంటాయి కాబట్టి మోసాల బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గూగుల్ లో యాప్స్, సాఫ్ట్ వేర్లకు సంబంధించిన సమాచారం కూడా వెతకకూడదు. యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుంటే మంచిది.

వ్యాధి లక్షణాలు, మందుల గురించి గూగుల్ లో వెతకకపోవడమే మంచిది. స్టాక్ మార్కెట్ సలహాల గురించి గూగుల్ లో అస్సలు వెతకకూడదు. ప్రభుత్వ వెబ్ సైట్ల గురించి కూడా గూగుల్ లో వెతకకూడదు. గూగుల్ ద్వారా సోషల్ మీడియా వెబ్ సైట్లకు సంబంధించిన సమాచారం కోసం కూడా అస్సలు వెతకకూడదు. ఈకామర్స్ వెబ్ సైట్లు, ఆఫర్లకు సంబంధించిన సమాచారం గురించి కూడా వెతకకూడదు. యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ల కోసం, డిస్కౌంట్ల కోసం కూపన్ కోడ్ల గురించి అస్సలు వెతకకూడదు.