ఎంఐఎం అతిపెద్ద పార్టీగా మారుతుందా..?

హైదరాబాద్ ఎంపీగా ఏ పార్టీ నాయకుడు గెలుస్తాడంటే.. ఆ ఎన్నిక కాకముందే చెప్పొచ్చు ఎంఐఎం పార్టీ నాయకుడని.. ఎందుకంటే 1984 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ ఎంపీగా వేరే పార్టీ గెలవలేదు. అందులోనూ ఓవైసీ కుటుంబం తప్ప ఇతరులెవరూ ఇక్కడి నుంచి ఎంపీగా కాలేదు. దీంతో అర్థమవుతుంది ఇక్కడ ఎంఐఎం పార్టీ ఎంత బలంగా ఉందని. అంతే కాకుండా ఎంపీ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఐఎం తప్ప ఇతర పార్టీని అక్కడి ప్రజలు ఎన్నుకోరు.. అయితే ఒకప్పుడు […]

Written By: NARESH, Updated On : November 29, 2020 10:36 am
Follow us on

హైదరాబాద్ ఎంపీగా ఏ పార్టీ నాయకుడు గెలుస్తాడంటే.. ఆ ఎన్నిక కాకముందే చెప్పొచ్చు ఎంఐఎం పార్టీ నాయకుడని.. ఎందుకంటే 1984 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ ఎంపీగా వేరే పార్టీ గెలవలేదు. అందులోనూ ఓవైసీ కుటుంబం తప్ప ఇతరులెవరూ ఇక్కడి నుంచి ఎంపీగా కాలేదు. దీంతో అర్థమవుతుంది ఇక్కడ ఎంఐఎం పార్టీ ఎంత బలంగా ఉందని. అంతే కాకుండా ఎంపీ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఐఎం తప్ప ఇతర పార్టీని అక్కడి ప్రజలు ఎన్నుకోరు.. అయితే ఒకప్పుడు హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎం ఇప్పడు దేశవ్యాప్తంగా పాగా వేస్తూ అతిపెద్ద పార్టీగా మారేందుకు స్కెస్ వేస్తోంది.

Also Read: హైదరాబాద్.. భాగ్యనగరం.. ఇందులో ఏదీ అసలు పేరు..?

ఆలిండియా మజ్లిస్ ఇత్తేహాద్ -ఉల్-ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ 1927 నవంబర్ 12న ఆవిర్భవించింది. మొదటగా ఈ పార్టీని ఎవరూ పట్టించుకోలేదు. అయితే 1984లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైపీ పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. 1984లో సలావుద్దీన్ ఎంఐఎం తరుపున హైదరాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 వరకు అదేపార్టీతో.. అదే నియోజకవర్గంలో ఎంపీగా కొనసాగుతూ వచ్చారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా హైదరాబాద్ ఎంపీ స్థానం మాత్రం మజ్లిస్ పార్టీదే. 2004లో సలావుద్దీన్ కుమారుడు ప్రస్తుత ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన కూడా అదే ధర్మాన్ని పాటిస్తూ వస్తున్నారు.

ఎంఐఎం పార్టీ కేవలం ఎంపీ స్థానమే కాకుండా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పార్టీ తరుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే పార్టీ అధినేత ఇంతటితో ఆగకుండా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. గత జీహెచఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని డిప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లోనూ కీలకంగా మారే అవకాశం ఉంది.

Also Read: కేసీఆర్‌‌ నోట.. మళ్లీ ఢిల్లీ మాట

హైదరాబాద్ లో పుట్టిన ఎంఐఎం ఇక్కడికే పరిమితం కాకుండా దేశంలోనూ విస్తరిస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది బీహార్ లోని కిషన్ గంజ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున పోటీ చేసిన ఖమ్రుల్ విజయం సాధించారు. ఇదే ఊపుతో మొన్నటి బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ ఐదు స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలోని సీమాంచల్ ప్రాంతంలోని అమౌర్, కోచాధమన్, జోకీహాట్, బైసీ, బహదూర్ నియోజకవర్గాల్లో ఎంఐఎం నాయకులు విజయం సాధించారు.

ఇప్పుడు త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ ఎంఐఎం పాగా వేయాలని చూస్తోంది. బెంగాల్ రాష్ట్రంలో 30 శాతం మంది ముస్లింలు ఉన్నారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినవారున్నారు. కోల్ కతా నగరం, ముర్షీదాబాద్, ఉత్తర దీనాజ్ పూర్, దక్షిణ దీనాజ్ పూర్, డైమండ్ హార్బర్ జిల్లాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉంది. ఇక్కడ ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అసిమ్ వకార్ వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని చెబుతున్నాడు. దీంతో మెల్లమెల్లగా ఎంఐఎం దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పావులు కదుపుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్