ఒక మారుమూల కరువు ప్రాంతం అనంతపురం కు చెందిన ఒక విద్యార్థి ఇంజనీరింగ్ చదువుకొని ప్రపంచంలోనే నంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా ఎలా ఎదిగారు. ఇంజనీరింగ్ లో పెద్దగా టాపర్ కూడా కానీ ఈ తెగులు వ్యక్తి అంత పెద్ద సంస్థను ఎలా అధిరోహించాడు. తెలుగు బిడ్డ అమెరికాలోని మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా ఎదిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? సమస్యలను ఎలా పరిష్కరించాడు. అతి పెద్ద సంస్థకు అగ్రస్థానంలోకి ఎలా వెళ్లాడు?.. అనంతపురం టు మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా ఎదిగిన సత్యనాదెళ్లపై స్పెషల్ స్టోరీ.
ప్రపంచలోని చాలా దేశాల్లో పెద్ద పెద్ద పోజిషన్లో ఉన్నారు. వ్యాపార వేత్తగా..రాజకీయ నాయకుడిగా.. తదితర రంగాలో తెలుగువారి సత్తా చూపిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన సత్యం నాదేళ్ల ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈవోగా ఉన్నారు.2014లో ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మైక్రోసాఫ్ట్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. అంతేకాకుండా సంస్థకు భారీ ఆదాయం తీసుకొచ్చేలా ప్రణాళికలు వేశారు.
1967లో జన్మించిన సత్యం నాదెళ్ల సొంతూరు అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలం బుక్కాపురం. సత్య తండ్రిమాజీ ఐఏఎస్ బిఎస్ యుగంధర్. గతంలో ఈయన ప్రధాన మంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశాడు. యుగంధర్ ఐఏఎస్ కు ఎంపికయ్యాక హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావడంతో హైదరాబాద్ లోనే సత్యనాదెళ్ల జన్మించాడు.. హైదరాబాద్ నగరంలోని పబ్లిక్ స్కూల్ లో చదివిన ఆయన ఆ తరువాత ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. కానీ అనుకోకుండా మణిపాల్ ఇనిస్టూట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. ఆ తరువాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ విస్ కాన్సిన్ -మిల్వాకీ నుంచి కంప్యూటర్ సైన్స్ చేశారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదివిన అనుపమను సత్య పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు. ఓ అబ్బాయి. పుస్తకాలు చదవడం, ఆన్ లైన్ కోర్సులు పూర్తిచేయడంపై సత్య ఆసక్తి చూపుతుండాడు. 22 ఏళ్ల క్రితం సత్యకు పెళ్లైంది. అదే ఏడాది మైక్రోసాఫ్ట్ లో చేరాడు. విండోస్ ఎన్ టీ ఆపరేటింగ్ సిస్టం ప్రాజెక్టులో పనిచేశాడు. క్రికెట్ పడిచస్తాడు సత్యనాదెళ్ల.
2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సత్యం నాదేళ్లా ఆంతకుముందు ఆయన మైక్రోసాప్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ ప్రైజేస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆ తరువాత సత్యం మైక్రోసాఫ్ట్ లో అనేక మార్పులు తీసుకొచ్చారు. సత్యం సీఈవో బాధ్యతలు చేపట్టేనాటికి మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం పెద్దగా లేదు. విండోస్ ఆపరేటింగ్ సిస్టం కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటోంది. దీంతో ఆయన సత్వరం వృద్ధి సాధించే లక్ష్యాలను పెట్టుకున్నారు.
ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని నవీకరించారు. యాపిల్ ఐ ప్యాడ్ కు ఆఫీస్ సాఫ్ట్ వేర్ ను తయారు చేశారు. అలాగే విండోస్ ఆపరేటింగ్ సిస్టం 10 ను తీసుకొచ్చారు. క్లౌడ్ అండ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంను ఎక్కువగా ఉపయోగించేలా చేశారు. మైక్రోసాఫ్ట్ సర్పేస్ బుక్ అనే ల్యాప్ టాప్ ను విడుదల చేశారు. సత్యం నాదేళ్ల తీసుకున్న ఈ నిర్ణయాలతో కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ ఏడు రెట్లు పెరిగి రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇక త్వరలోనే విండోస్ 11 ను ప్రవేశపెట్టేందుకు సత్యం ప్లాన్ రెడీ అవుతున్నారు.
సత్యం నాదేళ్ల ప్రస్తుతం బెల్లె వ్యూ -వాషింగ్టన్లో నివసిస్తున్నారు. ఆయన నికర సంపద 300 మిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది. 2019లో ఫైనాన్సియల్ టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’ గా సత్యం ఎంపకయ్యారు. ఆ తరువాత ‘30 బెస్ట్ ఈసీవో’స్ లో ఆయన ఒకరుగా స్థానం సంపాదించారు. ఆయన ఓ ఆత్మకత రాశారు. దాని పేరు ‘హిట్ రిఫ్రెష్’. తన జీవితం, ఉద్యోగం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఇందులో వివరించారు. ఈ పుస్తకం మీద వచ్చిన ఆదాయాన్ని ఆయన మైక్రోసాఫ్ట్ చేపట్టే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కేటాయించారు.