https://oktelugu.com/

అక్కడ కిలో స్వీట్ 9,000 రూపాయలు.. ఎందుకంత ఖరీదంటే..?

సాధారణంగా కిలో స్వీట్ ధర ఎంత ఉంటుంది అనే ప్రశ్నకు చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు 200 నుంచి 300 రూపాయల వరకు ఉంటుందని చెబుతారు. ఫేమస్ బ్రాండ్ స్వీట్లు కావాలంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే గుజరాత్ లోని సూరత్ నగరంలోని శరద్ పూర్ణిమ అనే స్వీటు షాపు యజమాని రోహాన్ మాత్రం కిలో స్వీటును ఏకంగా 9,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంత ఖరీదు ఎందుకనే ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానాలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 31, 2020 / 07:53 PM IST
    Follow us on


    సాధారణంగా కిలో స్వీట్ ధర ఎంత ఉంటుంది అనే ప్రశ్నకు చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు 200 నుంచి 300 రూపాయల వరకు ఉంటుందని చెబుతారు. ఫేమస్ బ్రాండ్ స్వీట్లు కావాలంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే గుజరాత్ లోని సూరత్ నగరంలోని శరద్ పూర్ణిమ అనే స్వీటు షాపు యజమాని రోహాన్ మాత్రం కిలో స్వీటును ఏకంగా 9,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంత ఖరీదు ఎందుకనే ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి.

    సాధారణంగా తయారయ్యే వస్తువులతో మాత్రమే కాకుండా బంగారంతో ఆ స్వీట్ ను తయారు చేస్తున్నారు. 10 గ్రాముల బంగారం 50,000 రూపాయలు దాటగా ఆ మిఠాయిల వ్యాపారి మాత్రం బంగారంతో స్వీట్లు తయారు చేసి వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రజలు సైతం ఈ బంగారంతో తయారైన స్వీట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటం గమనార్హం. సాధారణంగా స్వీట్ల తయారీకి సిల్వర్ తో చేసిన పేపర్ ను వాడతారు. అయితే ఈ స్వీట్ షాప్ లో మాత్రం బంగారం పూతతో తయారు చేసిన పేపర్ ను వాడతారు.

    ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో రోహాన్ చేసిన స్వీట్లకు డిమాండ్ బాగానే ఉంది. 24 క్యారెట్ల బంగారం కలిపిన ఈ స్వీట్లు రుచిగా ఉంటాయి. స్వీటు సాపు యజమాని రోహాన్ బంగారంతో తయారు చేసిన స్వీట్లను తిన్నవారికి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆయుర్వేదంలో సైతం బంగారం యొక్క ప్రాధాన్యతను పేర్కొన్నారని రోహాన్ చెబుతున్నారు.

    రోహాన్ మార్కెట్ లో డిమాండ్ తమ అంచనాల కంటే తక్కువగానే ఉందని.. అయితే భవిష్యత్తులో మాత్రం విక్రయాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో అంచనాలను మించి స్వీట్ విక్రయాలు జరుగుతాయని ఆశిస్తున్నామని తెలిపారు.